AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలం వచ్చేసింది.. ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే.. లేదంటే..

వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా అనేక రకాల వ్యాధులు వ్యాపించే ప్రమాదం పెరుగుతుంది. కలుషితమైన ఆహారం, నీటి ద్వారా టైఫాయిడ్, జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగడం, తాజాగా వండిన వేడి ఆహారాన్ని తీసుకోవడం, ఆకుకూరలు, కూరగాయలను బాగా కడిగి వాడడం అవసరం.

వర్షాకాలం వచ్చేసింది.. ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే.. లేదంటే..
Monsoon Health Tips
Shaik Madar Saheb
|

Updated on: Jun 13, 2026 | 1:34 PM

Share

వర్షాకాలం రాగానే వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడి, అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండడానికి పరిశుభ్రతకు, ఆహారానికి, నీటికి, ఇంటి చుట్టూ పరిసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎంతో అవసరం. దోమలు, ఇతర క్రిమికీటకాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. రోగాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని నిర్దిష్ట ఆహార నియమాలను పాటించడం తప్పనిసరి.. దీనిపై వైద్య నిపుణులు.. పలు ప్రత్యేక సూచనలు చేస్తున్నారు.

ముఖ్యంగా కలుషితమైన ఆహారం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వర్షాకాలంలో ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం, శుద్ధి చేసిన లేదా మరిగించిన నీటిని మాత్రమే తాగడం చాలా ముఖ్యం. వీలైనంతవరకు బయటి ఆహారాన్ని, ముఖ్యంగా వీధి వెంట లభించే స్ట్రీట్ ఫుడ్స్‌ను పూర్తిగా నివారించాలి.

ఆహార నియమాలలో భాగంగా, కాచి చల్లార్చిన నీరు తాగడము, అప్పటికప్పుడు వండిన వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవడము చాలా శ్రేయస్కరం. కూరగాయలు తీసుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వర్షం పడిన తర్వాత ఆకుకూరల కింద మట్టిలో క్రిములు, వాటి గుడ్లు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆకుకూరలను మంచిగా శుభ్రంగా కడిగి మాత్రమే వండుకోవాలి. అన్ని కూరగాయలను వండే ముందు బాగా కడగడం అలవాటు చేసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థపై భారం తగ్గించుకోవచ్చు. నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తీసుకోకుండా, ఎప్పటికప్పుడు వండినటువంటి వేడి ఆహారాన్ని తీసుకోవాలి.

వర్షాకాలంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, తప్పకుండా శుద్ధి చేసిన లేదా మరిగించిన నీటిని మాత్రమే తాగాలి. పండ్లను, తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వర్షాకాలంలో చేదు కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి. కాకరకాయ, వేప మెంతులు, పసుపు వంటి చేదు మూలికలు సహజసిద్ధంగా ఇన్ఫెక్షన్లను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి.

స్ట్రీట్ ఫుడ్స్ తింటే.. టైఫాయిడ్ బారిన పడినట్లే..

వర్షం పడిందంటే చాలు, కొంతమంది స్ట్రీట్ ఫుడ్స్ కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. రోడ్లపై లభించే పానీపూరి, చాట్ వంటివి ఎక్కువగా తింటారు. అయితే వీటిని అస్సలు తినకూడదు. అవి ఎంత రుచిగా ఉంటాయో, తింటే అంతకన్నా ఎక్కువ అనారోగ్యాన్ని అందిస్తాయి. రోడ్లపై లభించే తినుబండారాలపై ఈగలు, దోమలు వాలడం ద్వారా బ్యాక్టీరియా ఆ పదార్థాలపై చేరుతుంది. దీంతో అవి తినడం ద్వారా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ తినే క్రమంలో ఈ వర్షాకాలంలో ఈగలు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటది కాబట్టి, ఈగల ద్వారా సంక్రమించే వ్యాధులు ఎక్కువగా ఈ స్ట్రీట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి టైఫాయిడ్.. టైఫాయిడ్ అనేది ఈగల ద్వారా, అపరిశుభ్రమైన ఆహారం తినడం ద్వారా సంక్రమించే అవకాశం ఉంది.

ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, చల్లబడ్డ ఆహారం, ఈగలు లేదా దోమలు వాలిన ఆహార పదార్థాలను మనం ఖచ్చితంగా నివారించాలి. తాజాగా వండిన ఆహార పదార్థాలు, వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవడం అనేది ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండడానికి చాలా మంచిది.. అయితే.. ఈ జాగ్రత్తలు పాటించడంతోపాటు.. ఏమైనా సమస్యలుంటే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us