వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది అనేక రకాల ఇన్ఫెక్షన్స్‌తో ఇబ్బంది పడుతుంటారు.
వర్షాకాలం
అయితే చాలా మందికి నిమ్మరసం తాగడం అలవాటు ఉంటుంది. దీంతో వర్షాకాలంలో కూడా అది కంటిన్యూ చేస్తూ ఉంటారు.
నిమ్మరసం తాగడం
నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిదే, కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు వర్షాకాలంలో అస్సలే నిమ్మరసం తాగకూడదంట.
ఆరోగ్యానికి మేలు
కాగా, ఇప్పుడు మనం, అసలు వర్షాకాలంలో ఎవరు నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదో తెలుసుకుందాం.
నిమ్మరసం ఎవరు తాగకూడదు
అల్సర్ , గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వారు అస్సలే నిమ్మరసం తాగకూడదు. ఇది సమస్యలను తీవ్రతరం చేస్తుంది.
అల్సర్,గ్యాస్ట్రిక్
అంతే కాకుండా, దంత సమస్యలు ఉన్నవారు కూడా అస్సలే ఎక్కువ మోతాదులో నిమ్మరసం తీసుకోకూడదు. ఈ యాసిడ్ వల్ల పంటి ఎనామిల్ అరిగిపోతుంది. దంతాలు సెన్సిటివ్ గా ఉంటే పులుపు, నొప్పి వస్తుంది.
దంత సమస్యలు
నిమ్మరసంలో ఆక్సలేట్ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు నిమ్మరసం తాగే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
కిడ్నీ స్టోన్స్
అంతే కాకుండా అలర్జీ, దద్దర్లు వంటి సమస్యలు ఉన్నవారు కూడా వీలైనంత వరకు నిమ్మరసానికి దూరంగా ఉండటమే మంచిది.