సూర్యుడున్నా విటమిన్ డి లోపమా? ఎందుకో తెలుసా!

12-07-2026

Pic credit - Instagram

Phani Ch

భారతదేశంలో సూర్యరశ్మి ఎంత పుష్కలంగా ఉన్న నగరాల్లో దాదాపు 70 శాతం మంది, గ్రామాల్లో 20 శాతం మంది తీవ్రమైన విటమిన్ డి లోపంతో ఇబ్బంది పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

విటమిన్ డి అనేది మన శరీరానికి ఎంతో అవసరం. ఇది ముఖ్యంగా సూర్యరశ్మి మరియు మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా లభిస్తుంది.

మారుతున్న పని విధానాల వల్ల ప్రజలు ఇళ్లు, ఆఫీసులకే పరిమితమవుతున్నారు. దీనివల్ల ఎండ తగిలే అవకాశం తగ్గింది.

బయటకు వెళ్లినా శరీరాన్ని పూర్తిగా దుస్తులతో కప్పేయడం వల్ల చర్మానికి సూర్యరశ్మి నేరుగా తగలడం లేదు.

వాయు కాలుష్యం, మనం వేసుకునే సన్‌స్క్రీన్ లోషన్లు, కిటికీ అద్దాలు వంటివి సూర్యకిరణాలు మన చర్మానికి చేరకుండా అడ్డుకుంటున్నాయి.

ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య వచ్చే ఎండలో విటమిన్ డి3 ని ఉత్పత్తి చేసే అల్ట్రావైలెట్ బి కిరణాలు ఎక్కువగా ఉంటాయి.

పురుషులతో పోలిస్తే మహిళల్లో, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఈ విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ విటమిన్ లోపిస్తే విపరీతమైన అలసట, కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులు, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మానసిక నిరాశకు గురికావడం మరియు చిన్న వయసులోనే మతిమరుపు వచ్చే ప్రమాదం ఉంది