AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా.. బ్రష్ చేసేటప్పుడు ఈ ఒక్క తప్పు అస్సలు చేయకండి.. అసలు కథ తెలిస్తే అవాక్కే..

పిల్లల కోసం ప్లాన్ చేసుకునే దంపతులు సాధారణంగా డైట్ మార్చడం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వీటన్నింటి మధ్య చాలామంది నోటి ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోరు. అయితే నోటి శుభ్రత లోపిస్తే అది మీ ప్రెగ్నెన్సీ కలని దెబ్బతీస్తుందని, ముఖ్యంగా పురుషుల వీర్యకణాల నాణ్యతను కూడా తగ్గిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా.. బ్రష్ చేసేటప్పుడు ఈ ఒక్క తప్పు అస్సలు చేయకండి.. అసలు కథ తెలిస్తే అవాక్కే..
Hidden Connection Between Oral Hygiene And Pregnancy
Krishna S
|

Updated on: Jul 13, 2026 | 9:49 PM

Share

సాధారణంగా పిల్లల కోసం ప్లాన్ చేసుకునే దంపతులు ఒత్తిడి తగ్గించుకోవడం, సరైన నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం వంటి విషయాలపైనే ఎక్కువ శ్రద్ధ పెడతారు. కానీ ఈ క్రమంలో చాలామంది నోటి ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే నోటి శుభ్రత లోపిస్తే అది మీ సంతానోత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన దంతాలు, ఆరోగ్యకరమైన చిగుళ్లు మన శరీర ఓవరాల్ హెల్త్‌కు ఎంత ముఖ్యమో.. బేబీ ప్లానింగ్‌లో ఇవి ఎలా కీలక పాత్ర పోషిస్తాయో ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ సాంత్వన పయాసి వివరించారు. గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. దీనివల్ల చిగుళ్లు సాధారణం కంటే ఎక్కువ సెన్సిటివ్‌గా మారుతాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకముందే నోటి సమస్యలు ఉంటే గర్భం దాల్చాక అవి మరింత తీవ్రరూపం దాల్చుతాయి. అందుకే బేబీ ప్లానింగ్ లిస్ట్‌లో డెంటల్ చెకప్‌ను కూడా చేర్చుకోవడం చాలా అవసరం.

ఫ్లోసింగ్ ఎందుకు ముఖ్యం?

పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలను తీసేందుకు చాలామంది టూత్‌పిక్స్ వాడుతుంటారు. దీనివల్ల చిగుళ్లు దెబ్బతింటాయి. దానికి బదులుగా ఫ్లోసింగ్ అనేది అత్యంత సురక్షితమైన పద్ధతి. రోజూ ఫ్లోసింగ్ చేయడం వల్ల పళ్ల మధ్య ఆహారం ఇరుక్కుపోకుండా శుభ్రపడుతుంది. ఇది బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను, పళ్లపై ప్లాక్ పేరుకుపోవడాన్ని అడ్డుకుంటుంది. పళ్లకు క్యావిటీస్ రాకుండా కాపాడుతుంది.

ఇన్‌ఫ్లమేషన్ – ఫర్టిలిటీకి పెద్ద శత్రువు

నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే బ్యాక్టీరియా పెరిగిపోయి చిగుళ్ల వాపు, రక్తం కారడం వంటి క్రోనిక్ ఇన్‌ఫ్లమేషన్ సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో ఉండే ఈ ఇన్‌ఫెక్షన్ లేదా వాపు అనేది సంతానోత్పత్తికి పెద్ద శత్రువు. ఇది హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీయడమే కాకుండా, ఓవరాల్ ఫర్టిలిటీని తగ్గిస్తుంది.

పురుషుల స్పర్మ్ క్వాలిటీపై ప్రభావం

చిగుళ్లకు సంబంధించిన తీవ్రమైన వ్యాధిని పిరియాడోంటల్ అంటారు. పలు పరిశోధనల ప్రకారం.. ఈ వ్యాధి ఉన్న పురుషులలో స్పర్మ్ క్వాలిటీ, హెల్దీ చిగుళ్లు ఉన్న పురుషుల కంటే చాలా బలహీనంగా ఉన్నట్లు తేలింది. కాబట్టి కేవలం మహిళలే కాదు, పురుషులు కూడా నోటి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.

ప్రెగ్నెన్సీకి ముందే డెంటల్ చెకప్ ఎందుకు చేయించుకోవాలి?

గర్భం దాల్చిన తర్వాత పళ్ల సమస్య వస్తే ట్రీట్‌మెంట్ చేయడం కొంచెం క్లిష్టంగా మారుతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్స్‌రేలు తీయడం, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడటం వంటివి శిశువు ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి వాటిని నిపుణులు నిరాకరిస్తారు. అందుకే ప్లానింగ్ దశలోనే చికిత్స పూర్తి చేసుకోవడం ఉత్తమం.

బేబీ ప్లానింగ్ చేసేవారు పాటించాల్సిన 5 చిట్కాలు..

రెండుసార్లు బ్రషింగ్: రోజుకు రెండు సార్లు ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌తో పళ్లను, చిగుళ్లను శుభ్రం చేసుకోవాలి.

సాఫ్ట్ బ్రష్ వాడండి: ఎల్లప్పుడూ మెత్తటి బ్రిస్టల్స్ ఉన్న బ్రష్‌ను మాత్రమే వాడాలి. గట్టిగా రుద్దకూడదు.

రోజుకు ఒకసారి ఫ్లోసింగ్: బ్రషింగ్‌తో పాటు రోజుకు కనీసం ఒక్కసారైనా ఫ్లోసింగ్ చేయడం అలవాటు చేసుకోండి.

పోషకాహారం: విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఎ పుష్కలంగా ఉండే హెల్దీ డైట్ తీసుకోవాలి.

ముందే చెకప్: చిగుళ్ల నుండి రక్తం రావడం, నోటి దుర్వాసన లేదా పళ్ల నొప్పి ఉంటే.. బేబీ ప్లానింగ్ కంటే ముందే డెంటిస్ట్‌ను కలిసి ట్రీట్‌మెంట్ తీసుకోండి.

Follow Us
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా.. బ్రష్ చేసేటప్పుడు ఈ ఒక్క తప్పు
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా.. బ్రష్ చేసేటప్పుడు ఈ ఒక్క తప్పు
గూగుల్ జెమినీ ఏఐతో జీమెయిల్ కొత్త 'వాయిస్' ఫీచర్
గూగుల్ జెమినీ ఏఐతో జీమెయిల్ కొత్త 'వాయిస్' ఫీచర్
ఇరాన్‌కు రష్యా ‘డూమ్స్‌డే’ విమానం.. ఉలిక్కిపడ్డ ప్రపంచం!
ఇరాన్‌కు రష్యా ‘డూమ్స్‌డే’ విమానం.. ఉలిక్కిపడ్డ ప్రపంచం!
ప్రభాస్, త్రిష పేర్లతో ఊర్లు.. నెట్టింట వైరలవుతున్న బోర్డ్స్..
ప్రభాస్, త్రిష పేర్లతో ఊర్లు.. నెట్టింట వైరలవుతున్న బోర్డ్స్..
షుగర్ కంట్రోల్ అవ్వాలా? మెటబాలిజం పెరగాలా? దాల్చినచెక్కను ఇలా
షుగర్ కంట్రోల్ అవ్వాలా? మెటబాలిజం పెరగాలా? దాల్చినచెక్కను ఇలా
రాత్రిపూట ఫోన్‌తో పడుకుంటున్నారా?
రాత్రిపూట ఫోన్‌తో పడుకుంటున్నారా?
మొన్ననే హీరోయిన్‌గా ఎంట్రీ.. ఇప్పుడేమో బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి..
మొన్ననే హీరోయిన్‌గా ఎంట్రీ.. ఇప్పుడేమో బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి..
నోట్లో వేస్తే కరిగిపోయే కోనసీమ రాజుల చికెన్ బిర్యానీ!
నోట్లో వేస్తే కరిగిపోయే కోనసీమ రాజుల చికెన్ బిర్యానీ!
గుప్త నవరాత్రులు.. పది మహావిద్యలు ఎవరు? ఏ దేవిని పూజిస్తే ఎలాంటి
గుప్త నవరాత్రులు.. పది మహావిద్యలు ఎవరు? ఏ దేవిని పూజిస్తే ఎలాంటి
రాత్రి పడుకునే ముందు బొప్పాయి తింటే ఏమవుతుంది..?
రాత్రి పడుకునే ముందు బొప్పాయి తింటే ఏమవుతుంది..?