AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్‌కు తీసుకెళ్లి..

నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.30 వేల అప్పు ఇవ్వలేదనే కోపంతో ఇద్దరు స్నేహితులు కలిసి తమ మిత్రుడు సాయికుమార్‌ను హత్య చేశారు. మద్యం తాగుదామని పిలిచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు బండరాయితో తలపై దాడి చేసి చంపారు. అనంతరం అతని వద్ద ఉన్న బంగారం, సెల్‌ఫోన్‌తో పరారయ్యారు.

కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్‌కు తీసుకెళ్లి..
Nalgonda Murder Case
M Revan Reddy
| Edited By: |

Updated on: Jun 13, 2026 | 10:52 AM

Share

స్నేహం అంటే నమ్మకం.. ఆపదలో అండగా నిలబడటం. కానీ నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ ఘటన మాత్రం స్నేహం అనే బంధానికే మచ్చ తెచ్చింది. అప్పుగా డబ్బు అడిగితే ఇవ్వలేదనే కోపంతో స్నేహితుడినే హత్య చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన పూర్ణాన్ (37), ఆరీఫ్ (26) నల్లగొండలోని బొట్టుగూడ, మేథర్ కాలనీలో కొంత కాలంగా నివాసముంటూ బైక్ పై తిరుగుతూ చీరల వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉంటూ ఆడ వేశంలో ఎల్లమ్మ పండగలు చేసే బోధ్ సాయికుమార్ తో స్నేహం పెంచుకున్నారు. తరచూ కలిసి తిరగడం, మద్యం సేవించడం వల్ల ముగ్గురి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ చనువుతో సాయికుమార్ ను ఫుర్ఖాన్ రూ.30వేలు అప్పు అడిగాడు. అయితే సాయి కుమార్ డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో అతనిపై ఫుర్ధాన్ కక్ష పెంచుకున్నాడు. ఆ తర్వాత సాయికుమార్‌ను హత్య చేయాలని ఫుర్ఖాన్ కుట్ర పన్నాడు. ఈ నెల 8న మరో మిత్రుడు ఆరీఫ్ తో కలిసి కేశరాజుపల్లిలోనీ వెంచర్ లో మద్యం తాగుదామని పథకం ప్రకారం సాయి కుమార్ ను.. ఫుర్ఖాన్ పిలిచాడు. ముగ్గురూ కలిసి మద్యం తాగుతూ.. డబ్బు అత్యవసరముందని మరోసారి ఫుర్ఖాన్ ను 30 వేల రూపాయలను అప్పుగా అడిగాడు. సాయి కుమార్ ఇవ్వకపోవడంతో ఆవేశంలో ఇద్దరు కలిసి బండరాయితో సాయి కుమార్ తలపై కొట్టి హత్య చేశారు.

Nalgonda Murder Case

Nalgonda Murder Case

చేతికి, మెడకు ఉన్న ఆరు తులాల బంగారం, ఫోన్ తో బైక్ పై పరారయ్యారు. దొంగిలించిన బంగారాన్ని అమ్మేందుకు విజయవాడలో ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని ఒప్పుకోవడంతో బంగారం, బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని నల్లగొండ జిల్లా ఏఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి చెప్పారు. ఆధారాలు లేకుండా తప్పించుకోవచ్చని భావించినా, సెల్‌ఫోన్ ట్రాకింగ్, కాల్ డేటా వంటి సాంకేతిక ఆధారాలతో కటకటాల పాలయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కొత్త ఆధార్ యాప్‌తో మీ పనులు ఇక క్షణాల్లో!
కొత్త ఆధార్ యాప్‌తో మీ పనులు ఇక క్షణాల్లో!
ప్రియురాలితో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథుల కోసం పసందైన వంటకాలు
ప్రియురాలితో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథుల కోసం పసందైన వంటకాలు
ఈ 4 చెడు అలవాట్లు లక్ష్మీదేవిని ఇంటి నుంచి దూరం చేస్తాయా? గరుడ..
ఈ 4 చెడు అలవాట్లు లక్ష్మీదేవిని ఇంటి నుంచి దూరం చేస్తాయా? గరుడ..
ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్‌లో పాములు.. భయంలో జనం
ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్‌లో పాములు.. భయంలో జనం
మనిషి కనిపిస్తే వేటాడేస్తారు! అక్కడికి వెళ్తే తిరిగిరారు..
మనిషి కనిపిస్తే వేటాడేస్తారు! అక్కడికి వెళ్తే తిరిగిరారు..
మీ జాతకంలో పాప కర్తరి యోగం ఉందా? ఉంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు..
మీ జాతకంలో పాప కర్తరి యోగం ఉందా? ఉంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు..
రామ్ చరణ్-సుక్కూ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్!  వద్దంటోన్న ఫ్యాన్స్
రామ్ చరణ్-సుక్కూ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్!  వద్దంటోన్న ఫ్యాన్స్
పాత బంగారం విక్రయానికి జనం పరుగులు! మోదీ వ్యూహం ఫలిస్తోందా?
పాత బంగారం విక్రయానికి జనం పరుగులు! మోదీ వ్యూహం ఫలిస్తోందా?
25 ఏళ్ల అక్షరధామ్ ఆలయం.. 20 వేల శిల్పాలు, 108 అడుగుల విగ్రహం..
25 ఏళ్ల అక్షరధామ్ ఆలయం.. 20 వేల శిల్పాలు, 108 అడుగుల విగ్రహం..
3 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన.. 6 రోజులపాటు ద్వైపాక్షిక చర్చలు
3 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన.. 6 రోజులపాటు ద్వైపాక్షిక చర్చలు