మద్యపానం లివర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. తాగిన మరుసటి రోజు తలనొప్పి, ఏకాగ్రత లోపం, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. ఇవి లివర్ ప్రమాదంలో పడిందని సూచిస్తాయి. వెంటనే వైద్యుడిని సంప్రదించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం.