తిరువారూర్కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు దురై తన నిజాయితీతో అందరినీ ఆకట్టుకున్నాడు. విధులు నిర్వహిస్తుండగా చెత్తకుప్పలో దొరికిన రూ.30 లక్షల విలువైన బంగారం, వెండిని ఏమాత్రం ఆశపడకుండా పోలీసులకు అప్పగించాడు. పోలీసులు వాటిని అమ్మాయి పెళ్లి కోసం కొనుగోలు చేసిన యజమానులకు తిరిగి ఇచ్చారు. దురై చర్యతో ప్రాణం పోయిందనుకున్న కుటుంబానికి ఊరట లభించింది.