AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shoe Odor: బూట్లలో దుర్వాసనతో విసిగి పోయారా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి..

చెమట కారణంగా సాక్స్ మాత్రమే కాదు, బూట్లు కూడా దుర్వాసన వస్తుంటాయి. ఈ దుర్వాసన ఖచ్చితంగా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారా? మీరు మీ బూట్లను ఎంత శుభ్రంగా ఉంచుకున్నా, దుర్వాసనను వదిలించుకోలేక ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ కింది..

Shoe Odor: బూట్లలో దుర్వాసనతో విసిగి పోయారా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి..
How To Get The Smell Out Of Shoes
Srilakshmi C
|

Updated on: Feb 10, 2026 | 12:45 PM

Share

చాలా మంది బూట్లు ధరించడానికి ఇష్టపడతారు. అవి స్టైలిష్ లుక్ ఇస్తాయి. అయితే కొన్నిసార్లు చెమట కారణంగా సాక్స్ మాత్రమే కాదు, బూట్లు కూడా దుర్వాసన వస్తుంటాయి. ఈ దుర్వాసన ఖచ్చితంగా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారా? మీరు మీ బూట్లను ఎంత శుభ్రంగా ఉంచుకున్నా, దుర్వాసనను వదిలించుకోలేక ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ కింది ఈ సాధారణ చిట్కాల ద్వారా బూట్ల నుంచిచ్చే దుర్వాసనను సలువుగా వదిలించుకోండి..

బూట్ల నుంచి దుర్వాసనను ఎలా వదిలించుకోవాలి?

ఎండలో ఉంచండి

బూట్ల నుంచిచ్చే దుర్వాసనను తొలగించడానికి సులభమైన మార్గం టిని కొంత సమయం పాటు ఎండలో ఉంచడం. బూట్లలోని తేమ, చెమట బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి. ఇది దుర్వాసనకు ప్రధాన కారణం. ఇటువంటి పరిస్థితిలో బూట్లను కొంత సమయం పాటు ఎండలో ఉంచాలి. ఇది తేమను తొలగిస్తుంది. బూట్లలో పేరుకుపోయిన బ్యాక్టీరియాను చంపుతుంది. ఇది దుర్వాసనను కూడా తగ్గిస్తుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా అనేది సహజమైన దుర్గంధనాశని. ఇది తేమ, దుర్వాసనలను గ్రహించడంలో సహాయపడుతుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు బూట్ల లోపల టీస్పూన్ బేకింగ్ సోడాను చల్లి, మరుసటి రోజు ఉదయం వాటిని శుభ్రం చేయాలి. ఈ ప్రక్రియ బూట్ల నుంచి వాసనను చాలా సులభంగా తొలగించడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

టీ బ్యాగులు

టీ బ్యాగుల్లోని టానిన్లు బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. టానిన్లు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న సహజ సమ్మేళనాలు. కాబట్టి మీరు ఈ టీ బ్యాగులను బూట్ల లోపల ఉంచుకోవచ్చు. ఇది దుర్వాసనను సులువుగా తొలగిస్తుంది.

వెనిగర్

తెల్ల వెనిగర్ సహాయంతో బూట్ల వాసనను తొలగించవచ్చు. ఇందు కోసం ఒక స్ప్రే బాటిల్‌లో కొంచెం తెల్ల వెనిగర్, కొంచెం నీళ్లు తీసుకుని బాగా కలపాలి. బూట్ల లోపలి భాగంలో స్ప్రే చేయాలి. వైట్ వెనిగర్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది.

నిమ్మకాయ లేదా నారింజ తొక్క

బూట్ల నుంచి దుర్వాసనను తొలగించడానికి రాత్రి పడుకునే ముందు నిమ్మ లేదా నారింజ తొక్కలను వాటి లోపల ఉంచాలి. మరుసటి రోజు ఉదయం తొక్కలను తొలగించాలి. ఈ సులభమైన చిట్కా బూట్లలోని దుర్వాసనను ప్రభావవంతంగా తగ్గిస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!