AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: గుండెపోటు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఎంతసేపు నడవాలి?

Heart Attack: మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి బ్రిస్క్ వాకింగ్, ఏరోబిక్స్, ఈత, సైక్లింగ్, పరుగు అన్నీ మంచి వ్యాయామాలు. మీరు ప్రతిరోజూ 40 నిమిషాల కంటే ఎక్కువ స్పీడ్‌గా నడిస్తే మీరు బరువు కూడా తగ్గవచ్చు. మీరు గుండెపోటును నివారించాలనుకుంటే..

Heart Attack: గుండెపోటు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఎంతసేపు నడవాలి?
Subhash Goud
|

Updated on: Nov 06, 2025 | 9:41 PM

Share

Heart Attack: రోజుల్లో చాలా మందికి రకరకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. మారుతున్న జీవన శైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు దరి చేరుతున్నాయి. అయితే మధ్య కాలం నుంచి గుండె పోటు ప్రమాదాలు వేగంగదా పెరుగుతున్నాయి. ఇప్పుడు చలికాలం. సీజన్లో గుండెపోటు ఉన్న వారికి ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు వాకింగ్చేయడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. రోజూ వ్యాయామం చేయడం గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, గుండెపోటు ప్రమాదాన్ని నివారించడానికి మీరు ప్రతిరోజూ ఎంత సమయం నడవాలో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి 3 ప్రధాన కారణాలు ఇవే.. మర్చిపోయి కూడా ఈ తప్పులు చేయొద్దు..

ఇవి కూడా చదవండి

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు వారానికి 200 నిమిషాలు వేగంగా నడవాలి. 200 నిమిషాలు అంటే మీరు ప్రతిరోజూ 40 నిమిషాలు, వారానికి ఐదు రోజులు నడవాలి. ప్రతిరోజూ 40 నిమిషాలు నడవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. సాధారణ వేగంతో నడవడం కంటే వేగంగా నడవడం గుండెకు మేలు చేస్తుంది. అందుకే మీరు వేగంగా నడవడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి బ్రిస్క్ వాకింగ్, ఏరోబిక్స్, ఈత, సైక్లింగ్, పరుగు అన్నీ మంచి వ్యాయామాలు. మీరు ప్రతిరోజూ 40 నిమిషాల కంటే ఎక్కువ స్పీడ్‌గా నడిస్తే మీరు బరువు కూడా తగ్గవచ్చు. మీరు గుండెపోటును నివారించాలనుకుంటే ప్రతిరోజూ 40-45 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయండి. ఇది మీ గుండె, కాలేయం, మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us