AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: ఎస్‌బీఐ ఖాతాదారురులకు గుడ్‌న్యూస్‌.. ఇక అన్నింటికి ఒకటే.. కీలక ప్రకటన

SBI: ఎస్‌బీఐ రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన అనంతరం ఆ బ్యాంక్ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మాట్లాడారు. 'కేవైసీని ఒక సేవగా అందిస్తామని అన్నారు. ప్రస్తుతం ఎస్‌బీఐ కస్టమర్ కొత్తగా ఏ ఉత్పత్తి (కొత్త లోన్ లేదా పెట్టుబడి పథకం) తీసుకున్నా..

SBI: ఎస్‌బీఐ ఖాతాదారురులకు గుడ్‌న్యూస్‌.. ఇక అన్నింటికి ఒకటే.. కీలక ప్రకటన
SBI Loan
Subhash Goud
|

Updated on: Nov 06, 2025 | 3:57 PM

Share

SBI KYC: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు భారీ ఉపశమనం కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 చివరి నాటికి (మార్చి 2026 నాటికి) తమ అన్ని ఉత్పత్తులు, సేవలకు ఒకే కేవైసీ ప్రక్రియలను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తోంది. సెంట్రలైజ్డ్ నో యువర్ కస్టమర్ (KYC) పోర్టల్ ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. దీని ద్వారా వినియోగదారులు ఒక్కసారి కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తే చాలు మళ్లీ మళ్లీ కేవైసీ చేసుకోవల్సిన అవసరం లేకుండా చర్యలు చేపడుతోంది. ఇది అమలు అయితే బ్యాంకులోని అన్ని సేవలను సులభంగా పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Fact Check: టాటా నుంచి బైక్‌లు.. ధర కేవలం రూ.55,999లకే.. మైలేజీ 100కి.మీ.. నిజమేనా?

ఎస్‌బీఐ రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన అనంతరం ఆ బ్యాంక్ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మాట్లాడారు. ‘కేవైసీని ఒక సేవగా అందిస్తామని అన్నారు. ప్రస్తుతం ఎస్‌బీఐ కస్టమర్ కొత్తగా ఏ ఉత్పత్తి (కొత్త లోన్ లేదా పెట్టుబడి పథకం) తీసుకున్నా ప్రతిసారీ కేవైసీ ప్రక్రియ లేదా రీ-కేవైసీని పూర్తి చేయాల్సి వస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇది వినియోగదారులకు ముఖ్యంగా భారీ సంఖ్యలో జన ధన్ ఖాతాలు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఒక పెద్ద ఇబ్బందిగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్‌బీఐలో మాత్రమే 15 వేర్వేరు మార్గాల్లో కేవైసీ జరుగుతోందని గుర్తించామని, అందుకే మా అంతర్గత ప్రక్రియలను పూర్తిగా సంస్కరించాలని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Ration Card: రేషన్‌ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే రేషన్‌ కట్‌!

ఎస్‌బీఐ రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన అనంతరం ఆ బ్యాంక్ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ ‘కేవైసీని ఒక సేవగా (KYC as a service) అందిస్తాము’ అని వెల్లడించారు. ప్రస్తుతం ఎస్‌బీఐ కస్టమర్ కొత్తగా ఏ ఉత్పత్తి (కొత్త లోన్ లేదా పెట్టుబడి పథకం) తీసుకున్నా ప్రతిసారీ కేవైసీ ప్రక్రియ లేదా రీ-కేవైసీని పూర్తి చేయాల్సి వస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇది వినియోగదారులకు, ముఖ్యంగా భారీ సంఖ్యలో జన ధన్ ఖాతాలు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఒక పెద్ద ఇబ్బందిగా మారిందన్నారు. ‘ ఎస్‌బీఐలో మాత్రమే 15 వేర్వేరు మార్గాల్లో కేవైసీ జరుగుతోందని మేము గుర్తించాం. అందుకే మా అంతర్గత ప్రక్రియలను పూర్తిగా సంస్కరించాలని భావిస్తున్నాం’ అని ఛైర్మన్ శెట్టి వివరించారు. ఈ కేవైసీ పునరుద్ధరణ అనేది బ్యాంకు గుర్తించిన ఎనిమిది కీలకమైన సంస్కరణల్లో ఒకటైన ప్రాజెక్ట్ సరళ్‌లో భాగమని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్‌ 21వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?

అన్ని రకాల సేవలకు ఒకే కేవైసీ ప్రక్రియ:

ఇక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో (SBI)లో అందించే అన్ని రకాల సేవలకు ఒకే కేవైసీ ప్రక్రియను తీసుకువచ్చేందుకు ఉద్యోగుల బృందం పని చేస్తోందని అన్నారు. ఇటవలే బ్యాంక్ తెచ్చిన సరళ్ ప్రాజెక్టు కింద ఇ- కేవైసీ సరళీకరణ జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. సింగిల్ విండో కేవైసీ సిస్టమ్ అందుబాటులోకి వస్తే కస్టమర్లతో పాటు బ్యాంకుకూ పని భారం, ఒత్తిడి తగ్గుతుందన్నారు.

PAN Card: డిసెంబర్‌ వరకే గడువు.. ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి