AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: రేషన్‌ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే రేషన్‌ కట్‌!

Ration Card: రేషన్ కార్డు వినియోగదారులు రేషన్ కార్డును పక్కదారి పట్టకుండా ఉండడం కోసం ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు మరణించినా రేషన్ పొందుతున్న వాళ్ళు, పెళ్లి చేసుకుని వెళ్లిన..

Ration Card: రేషన్‌ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే రేషన్‌ కట్‌!
Subhash Goud
|

Updated on: Nov 04, 2025 | 3:10 PM

Share

Ration Card: రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతి నెల బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే రేషన్ కార్డులు ఉన్నప్పటికీ బియ్యం తీసుకోని వారు చాలామంది ఉన్నారు. వారి రేషన్‌ కార్డు జారీ చేసినప్పటికీ వారు ఎలాంటి రేషన్‌ సరుకులు తీసుకోని వారు చాలా మందే ఉన్నారు. అలాంటి రాష్ట్రాలు కూడా నిఘా పెడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాంటి వారిని అనర్హులుగా గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్ తీసుకునే ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఒక పని చేయాలని సూచిస్తుంది.

ఇది కూడా చదవండి: LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ పని చేయకుంటే సిలిండర్‌పై సబ్సిడీ నిలిచిపోతుంది?

రేషన్ కార్డు వినియోగదారులు రేషన్ కార్డును పక్కదారి పట్టకుండా ఉండడం కోసం ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు మరణించినా రేషన్ పొందుతున్న వాళ్ళు, పెళ్లి చేసుకుని వెళ్లిన ఆడపిల్లల పేర్లు తొలగించకుండా బియ్యాన్ని పొందుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.

ఇవి కూడా చదవండి

రేషన్ కార్డు దారులు తప్పనిసరిగా ఈ పని చెయ్యాలి:

ఈ నేపథ్యంలో ప్రతి నెల వందల క్వింటాళ్ళ బియ్యం దుర్వినియోగం అవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఈ కేవైసీ నమోదు చేసుకోవడానికి ఇప్పటికే చాలాసార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ ఇంకా చాలామంది ఈ కేవైసీ పూర్తి చెయ్యలేదు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలు కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.

ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్‌ 21వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?

రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరి చేస్తోంది ప్రభుత్వం. ఈకేవైసీ పూర్తి చేయకపోతే ఆరు నెలల తర్వాత వారి కోటా బియ్యం తగ్గుతుందని స్పష్టం చేశారు. అంటే వరుసగా ఆరు నెలల పాటు ఈకేవైసీ చేయించుకోని లబ్ధిదారులు రేషన్ కోల్పోతారని పేర్కొన్నారు. అయితే ఇంకా కొన్ని రేషన్ కేంద్రాలలో ఈకేవైసీ ప్రక్రియ పూర్తికావడం లేదని డీలర్లు చెబుతున్నారు.

ఇక చాలా మంది ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేసుకోలేదు. ఇక ఇప్పటికే చాలామంది ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఆధార్ అప్‌డేషన్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఆధార్ అప్డేషన్, రేషన్ షాప్ లో ఈ కేవైసీ రెండు అప్డేట్ కాకపోవడంతో రేషన్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని కొందరు లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేవైసీ చేయించుకోనివారు రేషన్ కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Maruti Cars: రూ.10 లక్షల లోపు 5 బెస్ట్‌ మారుతి కార్లు.. అద్భుతమైన మైలేజీ, ఫీచర్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి