Fact Check: టాటా నుంచి బైక్‌లు.. ధర కేవలం రూ.55,999లకే.. మైలేజీ 100కి.మీ.. నిజమేనా?
Fact Check: కేవలం రూ.55, 999కే కొత్త టాటా 125సీసీ బైక్‌ను విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త 125సీసీ మోటార్‌సైకిల్ మైలేజ్, స్టైల్, తక్కువ ధరల్లో బైక్‌లను తీసుకువచ్చే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో తిరుగులేని..

Fact Check: టాటా.. వాహనరంగంలో ఈ కంపెనీకి ప్రత్యేక స్థానముంది. టాటా ఏదీ చేసిన అది సంచలనమే అవుతుంది. టాటా మోటార్స్ ఇప్పుడు మార్కెట్లో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేవలం రూ.55, 999కే కొత్త టాటా 125సీసీ బైక్‌ను విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త 125సీసీ మోటార్‌సైకిల్ మైలేజ్, స్టైల్, తక్కువ ధరల్లో బైక్‌లను తీసుకువచ్చే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న హీరో, హోండా, బజాజ్ వంటి కంపెనీలకు ఇది గట్టి పోటీ ఇవ్వనున్నట్లు సోషైల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బైక్ ఫీచర్లు, ధర, మైలేజ్ వివరాలు:
- మోడల్ పేరు – టాటా 125సీసీ బైక్
- ప్రారంభ ధర- రూ.55,999 (ఇంట్రడక్టరీ ఎక్స్-షోరూమ్)
- ఇంజిన్ సామర్థ్యం -124.8సీసీ
- సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్
- క్లెయిమ్డ్ మైలేజ్ -100 KM/L వరకు (నివేదికల ప్రకారం)
- టెక్నాలజీ -డిజిటల్ బ్లూటూత్ డిస్‌ప్లే
- డిజైన్ హైలైట్స్- క్రోమ్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, అలాయ్ వీల్స్
- సేఫ్టీ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS)
- మార్కెట్ లాంచ్ అంచనా -2026 ప్రారంభంలో వస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే దీని ధర రూ.55,999 అనేది ఎక్స్-షోరూమ్ ధరగా ఉండే అవకాశం ఉంది. ఆన్-రోడ్ ధర దీని కంటే ఎక్కువగా ఉంటుందని కూడా చెబుతున్నారు.
ఇందులో నిజమెంత?
ఈ విషయంలో ఇంతలా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు టాటా మోటార్స్ స్పందించలేదు. సాధారణంగా.. ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాల గురించి.. కంపెనీలు ముందుగానే ప్రచారం చేస్తుంటాయి. లుక్, పోస్టర్ సంబంధించి అన్నింటినీ పంచుకుంటాయి. ఇటీవల టాటా మోటార్స్ విభజన జరిగినప్పుడు కూడా టూ వీలర్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు.. 125 CC బైక్స్ తెస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. అందుకే ఇక్కడ సోషల్ మీడియాలో జరిగే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాటి పట్ల.. కంపెనీ అధికారికంగా ప్రకటించేవరకు ఎలాంటివి నమ్మకపోవడమే మంచిది. మరి టాటా మోటార్స్ దీనిపై స్పందిస్తుందో లేదో వేచి చూడాలి.
View this post on Instagram
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




