Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా పోగొట్టుకోండి..

Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా పోగొట్టుకోండి..
Dark Circles Under The Eyes

Beauty Tips: ప్రస్తుత రోజుల్లో చాలా వరకు పని ఒత్తిడి.. మారిన జీవన శైలి కారణంగా చాలావరుకు అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటున్నారు. తగినంత నిద్ర, ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం వలన కంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి

Basha Shek

| Edited By: Phani CH

Mar 06, 2022 | 7:51 AM

Beauty Tips: ప్రస్తుత రోజుల్లో చాలా వరకు పని ఒత్తిడి.. మారిన జీవన శైలి కారణంగా చాలావరుకు అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటున్నారు. తగినంత నిద్ర, ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం వలన కంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. ఇక కరోనా మన జీవితాల్లోకి అడుగుపెట్టాక నిత్యం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందే గడపడం వల్ల ఈ సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా కళ్లకింద నల్లటి వలయాల (Dark Circles)తో ముఖం అందవిహీనంగా మారుతుంది. నిద్రలేమి, పోషకాహార లోపం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, ఎండలో ఎక్కువగా తిరగడం, అలర్జీ.. ఇలా ఇతర అంశాలు నల్లటి వలయాలకు కారణమవుతాయి. వీటిని పోగొట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల క్రిములను వాడుతుంటారు. అయితే వీటికి బదులు సహజ పద్ధతులను ఉపయోగించడం మేలంటున్నారు చర్మసౌందర్య నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

ఆరెంజ్ జ్యూస్..

ఇందులో ఉండే విటమిన్ సి కొద్ది రోజుల్లోనే కళ్ల కింద పడే నల్లటి వలయాలను తొలగిస్తుంది. దీని కోసం ఆరెంజ్ జ్యూస్ తీసి అందులో దూదిని నానబెట్టాలి. ఇప్పుడు ఈ దూదిని సుమారు 20 నిమిషాల పాటు కళ్లకింద ఉంచుకోవాలి. ఇలా వారంలో కనీసం రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితముంటుంది.

అలోవెరా జెల్..

అలోవెరాలో చర్మ సంరక్షణకు సంబంధించిన పోషకాలు చాలా ఉంటాయి. కళ్ల కింద నల్లటి వలయాలను పోగొట్టుకోవడానికి అలోవెరా జెల్ తీసుకుని దానికి ఒక చెంచా నిమ్మరసం కలపండి. ఇప్పుడు ఈ మాస్క్‌ని కళ్ల కింద అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత కడిగేయాలి. కొద్దిరోజుల్లోనే కళ్ల కింద వలయాలు తగ్గిపోతాయి.

బంగాళదుంప..

చర్మ సంబంధిత రుగ్మతలను తొలగించే గుణాలు బంగాళాదుంపలో పుష్కలంగా ఉంటాయి. ఇందుకోసం బంగాళాదుంప రసాన్ని తీసి కాటన్ సహాయంతో కళ్ల కింద భాగంలో రాయండి. ఇలా చేయడం వల్ల కళ్ల కింద వలయాలు మాయమవుతాయి. ఇక బంగాళాదుంప రసాన్ని ముఖంపై రాసుకుంటే చర్మంపై ఉన్న ట్యానింగ్ తొలగిపోతుంది.

కాఫీ..

చర్మ సంరక్షణకు సంబంధించి కాఫీ పొడిలో ఎన్నో పోషకాలుంటాయి. అందుకే సెలబ్రిటీలు సైతం దీనిని ఫేస్‌ స్ర్కబ్‌గా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కాఫీ పొడి తీసుకుని అందులో రెండు చెంచాల కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 15 నిమిషాల పాటు ముఖంపై మాస్క్‌లా ఉంచుకోవాలి. ఆతర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కీర..

తీవ్రమైన అలసట కూడా కళ్ల కింద నల్లటి వలయాలకు ఒక కారణం. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ ప్రాంతాన్ని తాజాగా ఉంచడానికి కీర సహాయం తీసుకోవచ్చు. ఇందుకోసం దోసకాయ తురుము రసం తీసి కళ్ల కింద అప్లై చేయాలి. కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేయడం వల్ల నల్లటి వలయాలు మాయమవుతాయి.

Also Read:అంగరంగ వైభవంగా.. జూబ్లీహిల్స్ టీటీడీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. కన్నుల పండువగా గరుడ వాహన సేవ.

Ravindra Jadeja: మెరుపు వీరుడు జడేజా డబుల్‌ సెంచరీ మిస్‌.. ద్రవిడ్‌, రోహిత్‌లను ఏకిపారేస్తున్న నెటిజన్స్

Ravindra Jadeja: మెరుపు వీరుడు జడేజా డబుల్‌ సెంచరీ మిస్‌.. ద్రవిడ్‌, రోహిత్‌లను ఏకిపారేస్తున్న నెటిజన్స్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu