Ravindra Jadeja: మెరుపు వీరుడు జడేజా డబుల్‌ సెంచరీ మిస్‌.. ద్రవిడ్‌, రోహిత్‌లను ఏకిపారేస్తున్న నెటిజన్స్

లంకతో తొలి టెస్టులో సింహంలా గర్జించాడు జడేజా. కెరీర్లో బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కాని అప్పటివరకు అతడిలో కనిపించిన ఉత్సాహం ఒక్కసారిగా నీరుగారిపోయింది. కెప్టెన్‌ తీసుకున్న అనూహ్యమైన నిర్ణయం.. జడేజాలో నిరాశను నింపితే.. అభిమానులను అసహనానికి గురిచేసింది.

Ravindra Jadeja: మెరుపు వీరుడు జడేజా డబుల్‌ సెంచరీ మిస్‌.. ద్రవిడ్‌, రోహిత్‌లను ఏకిపారేస్తున్న నెటిజన్స్
Angry Fans Slammed Rohit
Follow us

|

Updated on: Mar 05, 2022 | 9:45 PM

IND vs SL:  అది కోహ్లీ(Virat Kohli)కి వందో టెస్టు.. కాని మెరుపు వీరుడు మరొకడొచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏడో నెంబర్లో దిగి.. ఆకాశమే హద్దుగా చెలరేగి.. అదిరిపోయే ఇన్నింగ్స్‌తో.. ప్రత్యర్థులను చెదరగొట్టాడు. అతడే రవీంద్ర సిన్హ్‌ జడేజా. 33 ఏళ్ల జామ్‌నగర్‌ రాజ్‌పూత్‌.. తన కెరీర్లోనే అత్యద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. చాలా నెమ్మదిగా మొదలైన జడేజా ఇన్నింగ్స్‌ తర్వాత జోరందుకుంది. వరుస ఫోర్లు సిక్సర్లు బాదాడు. మంచి బంతులను వదిలేశాడు. అలకగా దొరికిన వాటిని బౌండరీ దాటించాడు. జడేజా జోరు… బౌండరీల హోరు చూస్తే డబుల్‌ సెంచరీ ఈజీగా దాటేస్తాడని అంతా అనుకున్నారు. ఎనిమిది వికెట్లు పడే సమయానికి జడ్డూ స్కోరు వందే. తొమ్మిదో వికెట్‌కు భారత్‌ వందకు పైగా పరుగులు జోడిస్తే.. అందులో జడేజా 80ప్లస్‌ స్కోర్ చేశాడు. ఈ ఊపులో డబుల్‌ ఖాయం అనుకుంటున్న సమయంలో.. కెప్టెన్‌ రోహిత్‌ డిక్లేర్‌ ఇచ్చేశాడు. ఒక్కసారిగా ఫ్యాన్స్‌ షాకయ్యారు. జడేజా నిరాశలో మునిగిపోయాడు. కెరీర్లో రెండోసారి సెంచరీ చేసిన బ్యాటర్‌ డబుల్‌ సెంచరీ దగ్గరిదాకా వచ్చి.. ఆ గోల్డెన్‌ చాన్స్‌ని మిస్‌అవ్వడం అంటే ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

2004లో సచిన్‌ విషయంలో అప్పటి కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఇలానే వ్యవహరించడం సంచలనమైంది.  పాకిస్తాన్‌లో పర్యటనలో సచిన్‌ టెండూల్కర్‌ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు అప్పటి కెప్టెన్‌ ద్రవిడ్‌ ఊహించని విధంగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. అలా కేవలం ఆరు పరుగుల దూరంలో సచిన్‌ డబుల్‌ సెంచరీ మిస్ అయ్యాడు.  ఇప్పుడు అదే రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా ఉన్న సమయంలో మరోసారి అలాంటి ఘటన జరగడం ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్‌, ద్రవిడ్‌లపై విరుచుకుపడుతున్నారు. జడేజా మాత్రం చాలా నిరాశగా కనిపించాడు. రంజీల్లో ట్రిపుల్‌ సెంచరీలు బాదిన జడేజా.. అంతర్జాతీయ టెస్టుల్లో మాత్రం ఒక్క సెంచరీయే చేశాడు. ఇది గోల్డెన్‌ చాన్సే అయినా.. మిస్‌ అవడం అతడి హార్ట్‌ని బ్రేక్‌ చేసింది.

Also Read: Finger millet: ఏంటి మీ డైట్‌లో రాగి లేదా..? అయితే మీరు చాలా కోల్పోతున్నారు.. ఎన్నో ఉపయోగాలు