AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Finger millet: ఏంటి మీ డైట్‌లో రాగి లేదా..? అయితే మీరు చాలా కోల్పోతున్నారు.. ఎన్నో ఉపయోగాలు

స్థూలకాయం సమస్యకి చెక్ పెట్టడానికి అందరూ రకరకాల మార్గాలను అన్వేశిస్తూ ఉంటారు. అధిక బరువు తగ్గడానికి  వ్యాయామాలతోపాటు.. డైలీ డైట్‌లో కొన్ని మార్పులు చేయడం అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Finger millet: ఏంటి మీ డైట్‌లో రాగి లేదా..? అయితే మీరు చాలా కోల్పోతున్నారు.. ఎన్నో ఉపయోగాలు
Finger Millet
Ram Naramaneni
|

Updated on: Mar 05, 2022 | 7:54 PM

Share

Health Tips: స్థూలకాయం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అధిక బరువు ఉంటే కారణంగా ఎన్నో రకాల వ్యాధులు మనషులను ఈజీగా అటాక్ చేస్తాయి. అందుకే స్థూలకాయం సమస్యకి చెక్ పెట్టడానికి అందరూ రకరకాల మార్గాలను అన్వేశిస్తూ ఉంటారు. అధిక బరువు తగ్గడానికి  వ్యాయామాలతోపాటు.. డైలీ డైట్‌లో కొన్ని మార్పులు చేయడం అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గడానికి రాగులు చాలా బాగా ఉపయోగపడతాయని పలు పరిశోధనల్లో నిరూపితమైంది. ఫింగర్ మిల్లెట్స్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాగిలో  కొలెస్ట్రాల్, సోడియం పెద్దగా ఉండవు. కొవ్వు 7 పర్సెంట్ మాత్రమే ఉంది. వీటితోపాటు.. కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు లాంటివి రాగుల్లో దండిగా ఉంటాయి. వీటిని రోజూ ఆహారంలో చేర్చడం ద్వారా మీ శరీరానికి అవసరమైన పోషకాలు లభించడంతోపాటు.. బరువు కూడా చెక్ పెట్టవచ్చు.  రాగుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం పదండి.

  1. రాగుల్లో కొలెస్ట్రాల్, సోడియం లేకుండా.. ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాగులు తినడం ద్వారా కొలెస్ట్రాల్, బిపిని తగ్గించుకోవచ్చు. ఫలితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
  2. రాగులు ఎముకల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంది. 100 గ్రాముల రాగుల్లో 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. వీటిని మీ ఆహారంలో చేర్చితే.. ఎముకలను బలంగా మార్చడంతోపాటు.. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  3. శరీరంలో ఐరన్ లోపం వల్ల.. రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఆహారంలో చేర్చడం ద్వారా రక్తం హీనత సమస్య తగ్గుతుంది.
  4. రాగిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తిన్న తరువాత కడుపు చాలా సేపు నిండి ఉంటుంది. ఆకలి వేయదు. దీని కారణంగా అతిగా తినడాన్ని అరికట్టడంతోపాటు.. శరీరానికి పోషకాలు కూడా లభిస్తాయి. అందుకే బరువు తగ్గడానికి రాగులు ఉత్తమమని పేర్కొంటున్నారు.
  5. డయాబెటిక్ రోగులు.. అల్పాహారం, భోజనంలో రాగులను చేర్చితే.. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. షుగర్ వ్యాధి బారిన పడే అవకాశం కూడా తక్కువ.

డైలీ రాగి జావను తాగవచ్చు. ఉదయం టిఫెన్‌గా.. మొలకెత్తిన రాగులను తినవచ్చు. దీంతోపాటు  రాగి పిండితో ఇడ్లీలు, దోశలను తయారు చేసుకొని తినవచ్చు. దీంతోపాటు పలు రకాల వంటలు చేసుకొని తినవచ్చు. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి.. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు.. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వారు తినకూడదు. థైరాయిడ్ రోగులు కూడా రాగులను తినకపోతే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ వార్త కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రచురించబడింది. మీకు ఏమైనా అనుమానాలు ఉండే పౌష్ఠికాహార నిపుణులు, డాక్టర్ల  సలహా తీసుకోండి..