Pregnancy Care: కడుపుతో ఉన్నవారికి ఎలాంటి విటమిన్ అవసరం.. ఏ ఆహారం తీసుకుంటే మంచిది..
ప్రెగ్నెన్సీ ఉన్నవారు మామూలు వారికంటే ఎక్కువ పోషకలున్న ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే పుట్టబోయే పిల్లలకు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి..
ప్రెగ్నెన్సీ ఉన్నవారు మామూలు వారికంటే ఎక్కువ పోషకలున్న ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే పుట్టబోయే పిల్లలకు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి అనేక పోషకాలు, విటమిన్లు ఇంకా ఖనిజాలు అనేవి చాలా అవసరం. సాధారణంగా మహిళలు తరచుగా విటమిన్లు A, C కలిగి ఉన్న వాటిని తింటారు, కానీ విటమిన్ D ని కలిగి ఉన్న వాటిని కూడా తీసుకోవాలి. విటమిన్ D ఇతర విటమిన్లు ఇంకా పోషకాల వలె గర్భధారణలో ముఖ్యమైనది. విటమిన్ డి రక్తంలో భాస్వరం ఇంకా కాల్షియం సమతుల్యతను నిర్వహిస్తుంది. ఇది కాల్షియంను కూడా గ్రహిస్తుంది. విటమిన్ డి ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేగాక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మీరు గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడొద్దు, ఎందుకంటే ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
విటమిన్ డి లోపం వల్ల మీ ఎముకలు నొప్పి లేదా బలహీనపడవచ్చు. దీంతో శిశువు ఎముకలు కూడా దృఢంగా ఉండవు. విటమిన్ డి లోపం శిశువు బరువును కూడా ప్రభావితం చేస్తుంది. గర్భిణీ స్త్రీలు అధిక రక్తపోటు వేధించవచ్చు. గర్భధారణ సమయంలో ఎండలో కూర్చోకపోవడం, బయటికి వెళ్లకపోవడం, విటమిన్ డి ఉన్నవాటిని తీసుకోకపోవడం, స్కిన్ పిగ్మెంటేషన్, సన్‌స్క్రీన్‌ను ఎక్కువగా వాడటం వంటివి కూడా శరీరంలో విటమిన్ డి లోపానికి కారణమవుతాయి.
అలాగే కడుపుతో ఉన్న పౌష్ఠిక ఆహారం తీసుకోవాలి. ఒక ఫుడ్ ఛార్ట్ ప్రిపేర్ చేయడం వల్ల సమతుల ఆహారం తీసుకునేందుకు వీలవుతుంది. తద్వారా గర్భిణీ స్త్రీలు, పుట్టబోయే శిశువు ఆరోగ్యవంతంగా ఉంటారు. గర్భం దాల్చిన వార్త మీకు అత్యంత సంతోషాన్నిచ్చేది. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైరానా పడకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా కాస్త సమయం కేటాయించి తగిన ప్రణాళికలు రూపొందించుకుంటే డెలివరీ సమయం వరకు హాయిగా ఉండొచ్చు. మనం సాధారణంగా తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగం కార్బొహైడ్రేట్స్(పిండి పదార్థాలు), ఫ్యాట్స్ (కొవ్వులు) ఉంటాయి. కానీ సమతుల ఆహారం అంటే కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్‌తో పాటు ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ఫ్లూయడ్స్ అన్నీ మన ఆహారంలో భాగమై ఉండాలి. ఒక డైట్ ఛార్ట్ పెట్టుకుని సమతుల ఆహారం అందేలా చూసుకుంటే తల్లికే కాకుండా, పుట్టబోయే బిడ్డకూ మేలు చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడం సహజమే. ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతామని భయపడొద్దు.
గమనిక: ఈ వార్త కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రచురించబడింది. మీకు ఏమైనా అనుమానాలు ఉండే పౌష్ఠికాహార నిపుణులు, డాక్టర్ల సలహా తీసుకోండి.
Read Also.. White Hair: ఒక్క తెల్ల వెంట్రుక పికేస్తే.. మిగతావన్నీ తెల్లగా అవుతాయా..? నిపుణులు ఏం చెబుతున్నారు..