AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Side Effects of Papaya: ఈ ఐదు రకాల సమస్యలున్నవారు బొప్పాయిని తినకపోవడం మంచిది

Side Effects of Papaya: బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే అయినా.. కొందరికి మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని సమస్యలున్న వారు బొప్పాయిని తినకపోవడం మంచిది...

Side Effects of Papaya: ఈ ఐదు రకాల సమస్యలున్నవారు బొప్పాయిని తినకపోవడం మంచిది
Subhash Goud
|

Updated on: Mar 06, 2022 | 10:51 AM

Share

Side Effects of Papaya: బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే అయినా.. కొందరికి మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని సమస్యలున్న వారు బొప్పాయిని తినకపోవడం మంచిది. ఆరోగ్య నిపుణుల వివరాల ప్రకారం..గుండె దడ, ఆందోళనకు గురవుతుంటే బొప్పాయి (Papaya)కి దూరంగా ఉండటం మంచిది. ఇందులో సైనోజెనిక్ గ్లైకోసైడ్ అమినో యాసిడ్స్‌ (Cyanogenic Glycosides Amino acids) ఉంటాయి. ఇది మీకు సమస్యలను మరింతగా పెంచుతుంది. సాధారణంగా ఇది గుండె రోగులకు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. గుండె దడ ఉన్నవారు దూరంగా ఉండటం మంచిది.

ఇక కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు బొప్పాయి తినడం మానేయాలి. అటువంటి పరిస్థితిలో బొప్పాయిని తీసుకోవడం ద్వారా కాల్షియం ఆక్సలేట్ ఉత్పత్తి అవుతుంది. ఇది మీ కిడ్నీలలో రాళ్ల సమస్యను పెంచుతుంది. ఈ సందర్భంలో రాళ్ల పరిమాణం కూడా పెరుగుతుంది. అందుకే కిడ్నీ స్టోన్స్‌ ఉన్నవారు బొప్పాయి వినియోగాన్ని నివారించండి. బొప్పాయిలో చిటినేస్ అనే ఎంజైమ్ ఉన్నందున అలెర్జీలు ఉన్నవారు కూడా తినకూడదని సలహా ఇస్తారు ఆరోగ్య నిపుణులు. దీంతో పలు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

గర్భిణీ స్త్రీలు కూడా బొప్పాయికి దూరంగా ఉండటం మంచిది. బొప్పాయిలో లేటెక్స్ ఉంటుంది. ఇది గర్భాశయంపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా ప్రీ-మెచ్యూర్ డెలివరీ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఇక దాని వేడి ప్రభావం కూడా కొన్నిసార్లు గర్భస్రావానికి కారణం కావచ్చు. పచ్చి బొప్పాయి పండిన బొప్పాయి కంటే ప్రమాదకరం. డయాబెటిక్ రోగులకు బొప్పాయి చాలా మేలు చేస్తుంది. అయితే మీ శరీరంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్నట్లయితే బొప్పాయికి దూరంగా ఉండటం ఎంతో మంచిది.

(గమనిక: ఇందులో అందించే అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే.  ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏమైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి)

ఇవి కూడా చదవండి:

Health Problems: 30 ఏళ్ల తర్వాత పురుషులు ఈ సమస్యలు ఎదుర్కొవచ్చు.. పూర్తి వివరాలు

యువ గుండెల్లో కల్లోలం.. సడెన్‌ స్ర్టోక్స్‌కి పోస్ట్‌ కొవిడ్‌ ప్రభావమే కారణమా?.. వైద్యుల నివేదికలో షాకింగ్ విషయాలు