యువ గుండెల్లో కల్లోలం.. సడెన్‌ స్ర్టోక్స్‌కి పోస్ట్‌ కొవిడ్‌ ప్రభావమే కారణమా?.. వైద్యుల నివేదికలో షాకింగ్ విషయాలు

యువ గుండెల్లో కల్లోలం.. సడెన్‌ స్ర్టోక్స్‌కి పోస్ట్‌ కొవిడ్‌ ప్రభావమే కారణమా?.. వైద్యుల నివేదికలో షాకింగ్ విషయాలు
Caridac In Youngers

గుండె లయ తప్పుతోంది. 40 ఏళ్ల వయసులోనే మొరాయిస్తోంది. చెట్టంత మనిషినీ ఉన్నట్టుండి కుప్పకూల్చుతోంది. ఆరోగ్యం పట్ల అనునిత్యం అప్రమత్తంగా ఉండే వాళ్లూ సడెన్‌గా చనిపోతున్నారు. అయితే యువ గుండెల్లో ఎందుకీ కల్లోలం...

Ganesh Mudavath

|

Mar 05, 2022 | 4:30 PM

గుండె లయ తప్పుతోంది. 40 ఏళ్ల వయసులోనే మొరాయిస్తోంది. చెట్టంత మనిషినీ ఉన్నట్టుండి కుప్పకూల్చుతోంది. ఆరోగ్యం పట్ల అనునిత్యం అప్రమత్తంగా ఉండే వాళ్లూ సడెన్‌గా చనిపోతున్నారు. అయితే యువ గుండెల్లో ఎందుకీ కల్లోలం. ఈ సడెన్‌ స్ర్టోక్స్‌కి(Sudden strokes) పోస్ట్‌ కొవిడ్‌ ప్రభావమే (Post Coved Effect)కారణమా? రాజ్‌ కౌశల్, సిద్దార్థ్‌ శుక్లా, పునీత్‌ రాజ్‌కుమార్, గౌతమ్‌ రెడ్డి, షేన్‌వార్న్…! అందరూ కరోనా బారిన పడి కోలుకున్నవాళ్లే.! అందరూ ఫిట్‌నెస్‌ పర్ఫెక్ట్. నిత్యం వ్యాయామం చేసే వాళ్లే.! బాడీని ఫిట్‌గా ఉంచేవాళ్లే…! కానీ వీళ్లందరూ చనిపోయింది హార్ట్‌ ఎటాక్‌(Heart attack) వల్లే. గతంలో 60 ఏళ్లు దాటిన వారిలోనే ఇలాంటి సడెన్‌ కార్డియాక్ అరెస్ట్‌ కనిపించేది. కానీ ఇప్పుడు 50 ఏళ్ల లోపే, ఇంకా చెప్పాలంటే 40 ఏళ్ల వయస్సులోనే గుండె ఆగిపోతోంది. ఇటీవల వరసగా తలెత్తుతున్న ఇలాంటి మరణాలు వైద్యులకూ అంతుచిక్కని మిస్టరీగా మారుతున్నాయి. ప్రధానంగా వ్యాయామాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయని వారు ఉన్నట్టుండి కుప్ప కూలిపోవడం విస్మయానికి గురి చేస్తోంది. అతిగా ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేయడం కూడా ప్రమాదమే అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అదీ నిజమే. కానీ కరోనా బారిన పడి కోలుకున్న వారి విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

సడెన్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్‌ లు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. అన్నింటికీ మించి యంగ్‌స్టర్స్ వీటి బారిన పడుతుండడంతో గుండెపై పోస్ట్‌ కొవిడ్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందన్న అంశంపై కీలక అధ్యయనాలు జరిగుతున్నాయి. ఈ నివేదికలో షాకింగ్ విషయాలు బయట పడ్డాయి. కరోనా వైరస్ గుండె లోపలి కణాలపై దాడి చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ప్రభావం గుండె పని తీరు పైనా తీవ్రంగా ప్రభావం చూపుతోందని తేల్చారు. ఇటీవల కాలంలో మృతిచెందిన రాజ్‌ కౌశల్, సిద్దార్థ్‌ శుక్లా, పునీత్‌ రాజ్‌కుమార్, గౌతమ్‌ రెడ్డి, షేన్‌వార్న్‌ విషయంలోనూ ఇలా జరిగే ఛాన్స్‌ లేకపోలేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. గుండె జబ్బులకు పోస్ట్‌ కొవిడ్‌కు లింక్‌ ఉందన్నది ప్రాథమికంగా తేలిన అంశం. అయితే అన్ని హార్ట్‌ స్ట్రోక్స్ కేవలం కరోనా కారణం కాదన్నది కూడా అంతే నిజం. అందుకే ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయే వాళ్లంతా బయటి నుంచి చూడ్డానికి చాలా ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపిస్తుంటారని డాక్టర్లు అంటున్నారు. కానీ తెలియకుండానే శరీరం లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. అందుకోసం వ్యాయామం చేయాలి. జిమ్‌కు వెళ్లాలి. కానీ రోజుకు ఎంతటైమ్ వర్కౌట్ చేయాలి? ముఖ్యంగా కొవిడ్ బారిన పడిన వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదే పనిగా ఓవర్ వర్కౌట్ చేస్తే గుండెపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? ఇలాంటి ప్రశ్నలు, అనుమానాలకు కచ్చితంగా సమాధానాలు తెలుసుకోవాలి. పోస్ట్‌ కొవిడ్ లక్షణాల్లో హార్ట్‌ ఎటాక్‌ కూడా చేరిపోయిందంటున్న డాక్టర్ల హెచ్చరికలను కచ్చితంగా పట్టించుకోవాలి. సరైన జాగ్రత్తలూ పాటించాలి.

Also Read

Tamil Nadu Politics: వాడిపోయిన రెండాకులు మళ్లీ చిగురించేనా.. శశికళతో సెల్వం భేటీ దేనికి సంకేతం!

IND vs SL: జడ్డూ ఖాతాలో అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన ‘సర్ జడేజా’..

Mohan Babu: ముదురుతున్న వ్యవహారం.. మోహన్ బాబు, విష్ణుపై HRCలో ఫిర్యాదు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu