Mohan Babu: ముదురుతున్న వ్యవహారం.. మోహన్ బాబు, విష్ణుపై HRCలో ఫిర్యాదు..
టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు తీరు పై మండి పడుతున్నారు. మోహన్ బాబు దగ్గర పనిచేసే నాగ శ్రీను వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది.
Manchu Mohan Babu: టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు తీరుపై మండి పడుతున్నారు. మోహన్ బాబు దగ్గర పనిచేసే నాగ శ్రీను వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. మోహన్ బాబు పై, ఆయన కుమారుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు పై నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు కర్నూలులోని మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషించారని మోహన్ బాబు పై ఆయన కుమారుడి పై మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు. తమ వద్ద పనిచేసిన హెయిర్ స్టైలిస్ట్ నాగశీనుపై ఉద్దేశపూర్వకంగానే చోరీ కేసు నమోదు చేశారన్న ఆరోపణలు మంచు ఫ్యామిలీపై ఉన్నాయి. ఈ ఆరోపణలపై వివాదం రాజుకుంది. తనను చిత్రహింసలకు గురి చేసి, కులం పేరుతో దూషించారని నాగశీను ఆవేదన వ్యక్త చేశాడు. దీంతో మంచు ఫ్యామిలీపై నాయీ బ్రాహ్మణులు భగ్గుమంటున్నారు.
మోహన్‌బాబు కుటుంబం తమ మనోభావాలను దెబ్బ తీసిందని, తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి నాయీ బ్రాహ్మణ సంఘాలు. అంతేకాదు, గుంటూరు, ఒంగోలులో ఆందోళన చేశారు. మంచు ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ర్యాలీ నిర్వహించారు నాయీ బ్రాహ్మణులు. మోహన్ బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. డబ్బు, అధికార బలం ఉందన్న అహంకారంతో, నాగశ్రీనుని కులం పేరుతో దూషించడాన్ని ఖండించారు కృష్ణయ్య. మోహన్‌బాబు క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు కృష్ణయ్య. ఎన్నో ఏళ్ల పాటు మంచు ఫ్యామిలీ దగ్గర పనిచేస్తే.. తనపై దొంగతనం కేసు పెట్టి, మానసికంగా వేధించారని ఆరోపిస్తున్నాడు నాగశ్రీను. మోహన్ బాబు తనను మోకాళ్లపై నిలబెట్టి అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మోహన్ బాబు, అతడి కుమారుడు మంచు విష్ణు నాయీ బ్రాహ్మణులకు, బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, వారిద్దరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :