RRR: చిక్కుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా.. సెంట్రల్ సెన్సార్ బోర్డ్ దగ్గర దీక్షలు చేస్తామంటూ హెచ్చరిక..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రలలో డైరెక్ట్రర్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్ (RRR).

RRR: చిక్కుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా.. సెంట్రల్ సెన్సార్ బోర్డ్ దగ్గర దీక్షలు చేస్తామంటూ హెచ్చరిక..
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 05, 2022 | 1:24 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రలలో డైరెక్ట్రర్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్ (RRR). ఈ మూవీ కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి సారి రామ్ చరణ్.. ఎన్టీఆర్ స్నేహితులుగా ఒకే స్క్రీన్ పై కనిపించబోతుండడంతో.. ఆర్ఆర్ఆర్ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా.. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనుండడం మరో హైలెట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్‏కు ఏ రెంజ్‏లో రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా… కరోనా కేసులు పెరగడంతో వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ కానుందని ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో తలనొప్పి వచ్చి పడింది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ చరిత్రలను ఆర్ఆర్ఆర్ సినిమాతో డైరెక్టర్ రాజమౌళి వక్రీకరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సిపిఐ కార్యదర్శి  రామకృష్ణ అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. నిస్వార్థంగా దేశంకోసం పోరాడిన వీరులను డబ్బులకోసం కించపరిచేలా ఆర్ఆర్ఆర్ సినిమా ఉంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ చరిత్రలను ఈ చిత్రంతో రాజమౌళి వక్రీకరిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారు దగ్గర పోలీస్ ఆఫీసర్ గా పని చేసినట్లు, అమ్మాయితో డాన్స్ చేసినట్లు చూపుతున్నారు. చరిత్రకారులకు కుటుంబ సభ్యులకు ముందుగా సినిమాని చూపాలి, అభ్యంతమైన సన్నివేశాలు తొలగించాలన్నారు.

దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమరయోధులను వ్యాపారం కోసం వాడుకుంటున్నారు. రాజమౌళి గొప్ప డైరెక్టర్. మగధీర, బాహుబలి చిత్రాలను తప్పుపట్టడం లేదు. సినిమాని సినిమాలాగే చూడాలన్నప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు ఉపయోగించాలి. ఉద్యమకారుల చరిత్రను కించపరచకూడదు. గతంలో కృష్ణ హీరోగా సీతారామరాజు సినిమా ఎంతమంది ప్రభావితం చేసింది. సినిమా వాళ్లని కలిసి అభ్యంతరాలు చెబుతాం. ఈ సినిమా ద్వారా యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు.. ఈ విషయంపై త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తాం..అలాగే త్వరలోనే హైదరాబాద్, ఢిల్లీ స్థాయిలో సెంట్రల్ సెన్సార్ బోర్డ్ దగ్గర దీక్షలు చేపడతాం అని అన్నారు. మరోవైపు.. దేశంలో కరోనా కేసులు తగ్గిపోవడంతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దేశ వ్యాప్తంగా పలు భాషల్లో మార్చి 25న రిలీజ్ కానుంది.

ఆర్ఆర్ఆర్ మూవీకి వివాదాలు కొత్త కాదు. అసలు మూవీ కథ, అందులోని పాత్రలే కేంద్రంగా అనేక వివాదాలు రాజుకున్నాయి. మ్యాటర్‌ కోర్టుమెట్లు కూడా ఎక్కింది. అప్పుడెప్పుడో పాత్రల ఫస్ట్ లుక్‌లు వచ్చినప్పటి నుంచి ఎవరో ఒకరు ఏదో ఒక విషయంపై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. అసలు ఈ సినిమా కథే తప్పంటూ గతంలో అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షుడు వీరభద్రరావు కోర్టులో కేసు వేశారు. చరిత్రని వక్రీకరిస్తుంటే చూస్తూ ఊరుకోమని.. కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు.అటు అల్లూరి వంశస్తులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అల్లూరిని బ్రిటిష్ తరఫున పని చేసిన పోలీసుగా చూపించడం తప్పని, దీని వల్ల స్వతంత్ర సమర యోధుడి చరిత్ర భావి తరాలకు తప్పుగా చెప్పినట్లు అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

అలాగే కొమరంభీమ్ పాత్ర పైనా వివాదం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం గెటప్‌లో కనిపించినప్పుడు రచ్చ రాజుకుంది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడికి టోపి పెట్టడం ఏంటని నిలదీశాయి ఆదివాసీ సంఘాలు. కొమురం భీమ్ చరిత్రను అర్ధం చేసుకొని సినిమా తీయాలని.. గిరిజనుల మనోభావాలను దెబ్బ తీస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించాయి.

Also Read: Telugu Indian Idol Episode 3: తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 3.. ఎవరు గోల్డెన్ మైక్ అందుకున్నారంటే..

Anand Mahindra: డైరెక్టర్ ట్వీట్‏కు రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్ర.. ప్రభాస్ సినిమాకు సపోర్ట్ చేస్తామంటూ..

Summer Diet: వేసవిలో ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే వ్యాధులు రావు.. అవేంటంటే..

మీరు పనిచేసే చోట ఈ వస్తువులు ఉంటే అంత శుభమే.. ఈ చిట్కాలను పాటిస్తే జీతం పెరుగుతుంది..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!