Tamil Nadu Politics: వాడిపోయిన రెండాకులు మళ్లీ చిగురించేనా.. శశికళతో సెల్వం భేటీ దేనికి సంకేతం!

Sesikala: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కొట్టుకు పోయె. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సమస్తం ఖాళీ. తమిళనాట ఉదయ సూర్యుడి ప్రతాపానికి నానాటికీ రెండాకుల ఎండి పోతున్న పరిస్థితి.

Tamil Nadu Politics: వాడిపోయిన రెండాకులు మళ్లీ చిగురించేనా.. శశికళతో సెల్వం భేటీ దేనికి సంకేతం!
Sesikala P Anner Selwam
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 05, 2022 | 4:22 PM

Tamil Nadu Politics: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కొట్టుకు పోయె. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సమస్తం ఖాళీ. తమిళనాట ఉదయ సూర్యుడి ప్రతాపానికి నానాటికీ రెండాకుల ఎండి పోతున్న పరిస్థితి. ఈ దుస్థితిలోంచి రెండాకులను కాపాడుకోవాలంటే.. చిన్నమ్మ దయ తలచాలి. ఆమె చేతుల్లోంచి జాలువారే చర్యల నీరు తాకితేనే- మనమిక బతికి బట్టకట్టేది. ఇదీ ఓపీఎస్ అధ్వర్యంలోని దక్షిణ తమిళనాడు(South Tamil Nadu) నాయకుల ఆందోళనతో కూడిన ఆలోచన. అందుకే చిన్నమ్మ శశికళ(Sesikala)ను కలిశారు. అన్నా డీఎంకే(AIDMK) పార్టీని మీ చేతుల్లో పెడతాం. మీకు అండదండగా ఉంటాం. దయచేసి పార్టీ జెండాను కాపాడమని వేడుకున్నారు.

ఇప్పడిప్పుడే తీరుకుంటున్న ప్రతిపక్ష పార్టీల నేతలు.. ఒక్కొక్కరిగా శశికళను కలుసుకుంటున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకేను కాపు కాస్తున్న పన్నీర్ సెల్వం తమ్ముడు. రాజా. ఈయన అధ్వర్యంలోని దక్షిణ తమిళనాడు ముఖ్యనేతలు. వీళ్లంతా కూడబలుక్కుని చిన్నమ్మను కలిశారు. ఆమె ముందు తమ ఆవేదనంతా వెళ్లగక్కారు. ఇప్పటికే అసెంబ్లీలో అడుగంటాం. లోకల్ ఎలెక్షన్లలోనూ దెబ్బ తిన్నాం. ఇకనైనా మేలుకోకుంటే కోలుకోలేం.. కాబట్టి పార్టీ పగ్గాలు మీరు చేపట్టాల్సిందేనంటూ ఆమెతో తమ గుండె గోషంతా చెప్పుకున్నారు. అందుకామె ఒప్పుకున్నారనీ ఎంతో సంబరంగా చెప్పుకుంటున్నారు ఓపీఎస్ తమ్ముడు రాజా.

వీళ్లు అనుకున్నట్టు.. ఇప్పటికిప్పుడు చిన్నమ్మ వచ్చి పార్టీ పగ్గాలు పట్టేంత సీనుందా? అందుకు ఓపీఎస్- ఈపీఎస్ ఒప్పుకుంటారా? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది. అలా ఒప్పుకోక పోవడానికి వీళ్లెవరని అంటున్నారు రాజా అధ్వర్యంలోని దక్షిణ తమిళనాడు నేతలు. పార్టీ ఓపీఎస్- ఈపీఎస్ సొత్తేం కాదు. ఆ మాటకొస్తే.. తాను జయలలిత కాలం నాటి నుంచీ పార్టీలో ఉన్నాననీ. పార్టీ బతికించుకోవడమే తమ అభిమతమని. అందుకు ఒకరి పర్మిషన్లు అక్కర్లేదనీ అంటున్నారు ఓపీఎస్ బ్రదర్ రాజా.

బేసిగ్గా ఓపీఎస్- ఈపీఎస్ రెండు వర్గాలు గా మారి. ఒకరు పార్టీని. మరొకరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను పంచుకున్నారు. ఎమ్మెల్యేల బలం పరంగా చూస్తే పళని స్వామి ఆధిపత్యంలో ఉన్నారు. పార్టీ ఈ మాత్రమైనా బతికి బట్టకడుతోందంటే. అదంతా ఆయన ప్రాతినిథ్యం వహించే ప్రాంతంలో ఒంటి చేత్తో పార్టీని గెలిపించిన విధం. కాబట్టి.. శశికళకు పార్టీని అప్పగించే ప్రసక్తే లేదన్నది పళనిస్వామి వాదన. మరి చూడాలి. ఈ పరిణామాలన్నీ పార్టీని ఏ తీరానికి చేర్చనున్నాయో.

Read Also….

పీక్ స్టేజ్ కు యూపీ పోరు.. ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కీలకం కానున్న ఆ ఇరువురి కలయిక