Health Problems: 30 ఏళ్ల తర్వాత పురుషులు ఈ సమస్యలు ఎదుర్కొవచ్చు.. పూర్తి వివరాలు

Health Problems: మనిషికి 30 ఏళ్ల వయసులో పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం వంటివి పాటించినట్లయితే సమస్యలను దూరం చేసుకునే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Subhash Goud

|

Updated on: Mar 06, 2022 | 7:42 AM

బలహీనమైన ఎముకలు: 30 ఏళ్ల వయస్సులో మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఈ సమయంలో బాధ్యతల కారణంగా చాలా మంది ఎముకలలో నొప్పితో బాధపడుతుంటారు. ఎముకలు బలహీనపడటమే దీనికి కారణం. ఎముకలకు విటమిన్స్‌ లోపం కారణంగా సమస్య వచ్చే అవకాశం ఉంది.

1 / 5
గుండె జబ్బులు: సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. జంకుఫుడ్డు, ప్రోటీన్స్‌ ఉన్న ఆహారం తీసుకోకపోతే శరీరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే 30 ఏళ్ల తర్వాత చాలా మందిలో ఈ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. మంచి ఆహారం, పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

2 / 5
బట్టతల: ఆహారం, జీవనశైలి కాకుండా, హార్మోన్ల మార్పుల కారణంగా తరచుగా 30 ఏళ్ల తర్వాత బట్టతల రావడం ప్రారంభమవుతుంది. అలాంటి వారు హెయిర్ ఫాల్‌ను ప్రారంభంలోనే ఆపడానికి ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది.

3 / 5
ఊబకాయం: జీవక్రియ రేటు మందగించడం వల్ల పురుషులలో ఊబకాయం సమస్య వస్తుంటుంది. 30 ఏళ్లు దాటితేనే ఊబకాయం కనిపిస్తుందని కాదు.. జీవనశైలి సరిగా లేకున్నా, ఆహారం సరిగా లేకుంటే స్థూలకాయం మనల్ని ఎప్పుడైనా వెంటాడవచ్చు. అందుకే ఆహార నియమాలు పాటించడం ఎంతో  మంచిదంటున్నారు.

4 / 5
ప్రోస్టేట్ క్యాన్సర్: 30 ఏళ్ల తర్వాత పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ స్థితిలో వారు అధిక మూత్రవిసర్జన, మూత్రంలో మంట వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిలో వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

5 / 5
Follow us