White Hair: ఒక్క తెల్ల వెంట్రుక పికేస్తే.. మిగతావన్నీ తెల్లగా అవుతాయా..? నిపుణులు ఏం చెబుతున్నారు..

గతంలో ఎంతో పోషకాలు ఉన్న పౌష్టిక ఆహారాన్ని మాత్రమే తినేవారు. అందుకే వారు ఎలాంటి అనారోగ్యానికి గురయ్యేవారు కాదు..

White Hair: ఒక్క తెల్ల వెంట్రుక పికేస్తే.. మిగతావన్నీ తెల్లగా అవుతాయా..? నిపుణులు ఏం చెబుతున్నారు..
Hair
Follow us

|

Updated on: Mar 06, 2022 | 7:10 AM

గతంలో ఎంతో పోషకాలు ఉన్న పౌష్టిక ఆహారాన్ని(Food) మాత్రమే తినేవారు. అందుకే వారు ఎలాంటి అనారోగ్యానికి గురయ్యేవారు కాదు.. కానీ ప్రస్తుతం జీవనవిధానంలో చాలా మార్పులు వచ్చాయి, వస్తున్నాయి. అందుకే ప్రస్తుతం చాలా మంది పైగా బాగా కనిపించినా.. చాలా బలహీనంగా ఉంటున్నారు. ఒకప్పుడు రాగిజావ తాగి పెరిగి ఇక ఇప్పుడు వృద్దాప్యంలో ఉన్నవారు కూడా ఇంకా దృఢంగానే కనిపిస్తూ ఉంటారు. ఇక నేటి రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి జీవనశైలిలో అయితే ఊహించని రేంజ్‌లోనే మార్పులు వచ్చాయి. ఎంత మార్పు అంటే..

ఒకప్పుడు కేవలం ముసలి వాళ్లకు మాత్రమే తెల్ల వెంట్రుకలు కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రకలు వస్తున్నాయి. ఇలా చాలా మంది చిన్న వయస్సులోనే తెల్ల వెంట్రుకలు వచ్చి ముసలాడిలా కనిపిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవలి కాలంలో ఎంతో మంది తెల్ల వెంట్రుకలను కలర్ వేసి కవర్ చేస్తున్నవారు ఉన్నారు. ఇలా కలర్ వేయడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చు. అయితే తెల్ల వెంట్రుకల విషయంలో ఇప్పటికే ఎంతోమందిలో ఎన్నో సందేహాలు ఉన్నాయి.

ముఖ్యంగా తలలో వచ్చిన తెల్ల వెంట్రుక ఒక్కటి పీకేస్తే ఆ తర్వాత తల మొత్తం తెల్ల వెంట్రుకలు వస్తాయి అని ఒక నమ్మకం అందరిలో ఉంది. ఇప్పటికీ దీనిని నమ్మే వారి ఎంతోమంది తలలో తెల్ల వెంట్రుకలు పీకడానికి భయపడిపోతుంటారు. అయితే నిజంగానే ఇలా జరుగుతుందా అంటే.. తలలో వెంట్రుకలు తెల్లగా ఉండాలా నల్లగా ఉండాలా తేడాను నిర్ణయించేది మెలనిన్. కుదుళ్ల మొదలు మెలానిన్ ఉత్పత్తి లేకపోతే వెంట్రుకలు తెల్లగా మారిపోతూ ఉంటాయి. అయితే ఒక్క తెల్లవెంట్రుక పీకేస్తే అన్ని తెల్లగా మారిపోతాయన్నది ఇది కేవలం అపోహ మాత్రమే అని వైద్యులు అంటున్నారు. తలపై ఒకే ప్రాంతంలో వెంట్రుకలు గుంపుగా తెల్లగా మారడం వల్ల ఎంతోమంది అలా భావిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ మెలనిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడే తలలో వెంట్రుకలు తెల్లగా మారుతాయి అని అంటున్నారు.

గమనిక: ఈ వార్త కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రచురించబడింది. మీకు ఏమైనా అనుమానాలు ఉండే పౌష్ఠికాహార నిపుణులు, డాక్టర్ల సలహా తీసుకోండి.

Read Also.. Ice Cream: ఐస్‌క్రీము తింటున్నారా.. అయితే జాగ్రత్త.. అందులో ఉండే ఆ లిక్విడ్ ప్రాణాలకే ప్రమాదం..!