AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teeth: దంతాల రంగు మారడానికి మీరు చేసే ఈ 5 తప్పులే కారణం.. అవేంటంటే..?

Teeth: అందమైన తెల్లటి దంతాలు కావాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పదార్థాలు తినడం వల్ల దంతాలు రంగు మారుతాయి. ఇది రూపాన్ని పాడుచేయడమే కాకుండా నవ్వడానికి

Teeth: దంతాల రంగు మారడానికి మీరు చేసే ఈ 5 తప్పులే కారణం.. అవేంటంటే..?
Teeth Change
uppula Raju
|

Updated on: Mar 05, 2022 | 10:01 PM

Share

Teeth: అందమైన తెల్లటి దంతాలు కావాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పదార్థాలు తినడం వల్ల దంతాలు రంగు మారుతాయి. ఇది రూపాన్ని పాడుచేయడమే కాకుండా నవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఏ పదార్థాలు తినడం వల్ల దంతాల పాడవుతాయో తెలుసుకుందాం. చలికాలమైనా, వేసవికాలమైనా అందరూ టీ తాగడానికి ఇష్టపడతారు. కానీ కొంతమంది టీ ఎక్కువగా తాగుతారు. ఇది దంతాలకు మంచిది కాదు. కాఫీ కంటే టీ దంతాల మీద చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఇది దంతాలపై ఉండే ఎనామిల్‌ని దెబ్బతీస్తుంది. దీని కారణంగా దంతాలు పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతాయి. స్వీట్లు ఎక్కువగా తినడం దంతాలకు మంచిది కాదు. దీని కారణంగా నాలుక రంగు మారుతుంది. అలాగే మిఠాయి లేదా స్వీట్లు దంతాలపై మరకలను వదిలివేస్తాయి. అందుకే స్వీట్లని తగ్గిస్తే మంచిది. టొమాటో, మిరపకాయ తినేటప్పుడు వాటిపై సాస్ వేసుకొని తింటాం. కానీ ముదురు రంగు సాస్ పళ్లను పాడు చేస్తుంది. అందువల్ల లేత రంగు క్రీము సాస్లను తింటే మంచిది. అలాగే వాటిని తిన్న వెంటనే బ్రష్ చేయాలి.

యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాలు, పానీయాలు దంతాలను ప్రమాదంలో పడేస్తాయి. ఎనర్జీ డ్రింక్స్ దంతాల బయటి పొరను లేదా పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. అందువల్ల వర్కౌట్స్ సమయంలో ఎనర్జీ డ్రింక్స్ వినియోగాన్ని తగ్గిస్తే మంచిది. సోడా, కూల్‌ డ్రింక్స్‌, ఇతర శీతల పానీయాలు దంతాలకు హానికరం. ఈ కార్బోనేటేడ్ డ్రింక్స్‌లో ఉండే రసాయనాలు దంతాలను పాడు చేస్తాయి. దంతాలు పసుపు రంగులో మారడమే కాకుండా బలహీనంగా తయారవుతాయి. బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, చెర్రీస్ వంటి అనేక పండ్లు పళ్లపై మరకలను కలిగిస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉంటే మంచిది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Beard Itching: గడ్డం దురదగా ఉంటుందా.. మీరు ఈ తప్పులు చేస్తున్నారని అర్థం..!

Dry Fruits: ఈ డ్రై ఫ్రూట్స్‌తో సులభంగా బరువు తగ్గొచ్చు.. డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే..

Betel Leaves Benefits: పెళ్లైన పురుషులు పాన్‌ తింటే అద్భుత ఫలితాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!