Dry Fruits: ఈ డ్రై ఫ్రూట్స్‌తో సులభంగా బరువు తగ్గొచ్చు.. డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే..

Dry Fruits: ఆధునిక జీవన శైలిలో చాలామంది రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యమైనది అధిక బరువు పెరగడం. ఇది పురుషులు, మహిళలు, పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది.

Dry Fruits: ఈ డ్రై ఫ్రూట్స్‌తో సులభంగా బరువు తగ్గొచ్చు.. డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే..
Dry Fruits
Follow us
uppula Raju

|

Updated on: Mar 05, 2022 | 9:13 PM

Dry Fruits: ఆధునిక జీవన శైలిలో చాలామంది రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యమైనది అధిక బరువు పెరగడం. ఇది పురుషులు, మహిళలు, పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి తక్కువ బరువుతో ఉన్నప్పుడే ఫిట్‌గా ఉంటాడు. అదనపు బరువు ఉన్నవారు కిడ్నీ, కాలేయ సమస్యలను ఎదుర్కొంటారు. ఇది ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. బరువు పెరగడం వల్ల చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. అందువల్ల మంచి ఆహార శైలిని మెయింటెన్‌ చేస్తే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. తక్కువ జీవక్రియ బరువు పెరగడానికి దారితీస్తుందని మర్చిపోవద్దు. కొన్ని డ్రై ఫ్రూట్స్ జీవక్రియను పెంచుతాయి. తద్వారా బరువుని తగ్గిస్తాయి. డ్రై ఫ్రూట్స్‌ని సూపర్ ఫుడ్స్ అని కూడా పిలుస్తారు. చిరుతిళ్లకు బదులు వీటిని తింటే అది జీవక్రియను పెంచుతుంది. అదనపు కొవ్వు, కార్బోహైడ్రేట్లను శరీరంలోకి వెళ్లకుండా కాపాడుతుంది. బరువు తగ్గించడంలో సహాయపడే కొన్ని డ్రై ఫ్రూట్స్‌ గురించి తెలుసుకుందాం.

1. బాదంపప్పులో చాలా తక్కువ కేలరీలు ఎక్కువ పోషకాలు ఉంటాయి. ప్రతిరోజూ 5 నుంచి 7 బాదంపప్పులు తింటే అవి ప్రోటీన్, మోనోశాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

2. పిస్తాలో ఫైబర్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. పిస్తాపప్పు తిన్న తర్వాత కాసేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. తద్వారా ఎక్కువగా ఆహారం తినలేం.

3. ఖర్జూరం బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండిన భావనని కలిగిస్తుంది. ఇందులో విటమిన్ B5 కూడా ఉంటుంది. ఇది శక్తిని పెంచుతుంది. యోగా లేదా వ్యాయామం తర్వాత కర్జూర తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

4. జీడిపప్పులో 70% మెగ్నీషియం ఉంటుంది. ఇది శరీర కొవ్వు, కార్బోహైడ్రేట్ జీవక్రియను నియంత్రిస్తుంది. అందువల్ల ఇది బరువు పెరగడాన్ని నిరోధిస్తుంది.

5. వాల్‌నట్‌లో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్, మంచి కొవ్వు, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Viral Photos: హాలీవుడ్ హల్క్‌ సినిమా చూశారా.. ఇప్పుడు నిజ జీవితంలో హల్క్‌ని చూడండి..!

Betel Leaves Benefits: పెళ్లైన పురుషులు పాన్‌ తింటే అద్భుత ఫలితాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

LIC Policy: ప్రతి నెల రూ.51,000 పెన్షన్.. ఉన్నన్ని రోజులు భర్తకి.. ఆ తర్వాత భార్యకి పెన్షన్..!

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.