AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: షేన్‌వార్న్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇలా చాలామంది.. చిన్నవయసులోనే గుండెపోటుకి కారణాలేంటి..?

Heart Attack: ఇటీవల చాలామంది ప్రముఖులు గుండెపోటుతో చనిపోతున్నారు. సాధారణంగా బీపీ, ఊబకాయం, కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వస్తాయని అందరు అనుకుంటారు. అలా జరగకుండా

Heart Attack: షేన్‌వార్న్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇలా చాలామంది.. చిన్నవయసులోనే గుండెపోటుకి కారణాలేంటి..?
Heart Attack Symptoms
uppula Raju
|

Updated on: Mar 05, 2022 | 9:16 PM

Share

Heart Attack: ఇటీవల చాలామంది ప్రముఖులు గుండెపోటుతో చనిపోతున్నారు. సాధారణంగా బీపీ, ఊబకాయం, కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వస్తాయని అందరు అనుకుంటారు. అలా జరగకుండా ఉండేందుకు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహిస్తారు. రోజు వ్యాయామాలు చేస్తారు. అయినా కూడా కొంతమంది గుండెపోటుకి గురవుతున్నారు. హఠాత్తుగా చనిపోతున్నారు. ఒక రోజు ముందు ఆస్ట్రేలియా లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ 52 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు. అంతకు ముందు నటుడు పునీత్ రాజ్‌కుమార్ కూడా గుండెపోటుతో మరణించాడు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పుడూ ఫిట్‌గా కనిపించే వ్యక్తులు కూడా గుండె జబ్బులకి గురవుతున్నారు. దీనికి కారణాలేంటో తెలుసా.. వాస్తవానికి హృదయ సంబంధ వ్యాధులకు మానసిక ఒత్తిడి కారణమని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటుకు గురయ్యే వారు మానసికంగా ఇబ్బందిపడేవారు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. తరచుగా మానసిక ఒత్తిడి లేదా భయముతో బాధపడేవారు గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా సందర్భాలలో చనిపోవడం జరుగుతుంది.

పెరుగుతున్న మానసిక ఒత్తిడి కారణంగా మెదడు అనేక రకాల హార్మోన్లను విడుదల చేయడం ప్రారంభిస్తుంది. దీంతో శరీరంలో బీపీ పెరుగుతుంది. ఇలా పదే పదే జరిగినప్పుడు గుండె ధమనులు ఉబ్బడం ప్రారంభిస్తాయి. చాలా కాలంగా ఈ సమస్య కారణంగా ధమనులలో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. దానివల్ల గుండెపోటు వస్తుంది. నేటి కాలంలో ప్రజలు వివిధ కారణాల వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో వారికి గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ప్రజలు వారి శారీరక దృఢత్వంపై శ్రద్ధ చూపుతారు కానీ మానసిక ఆరోగ్యాన్ని విస్మరిస్తారు.

జన్యుపరమైన కారణాల వల్ల కూడా గుండెపోటు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంటే కుటుంబంలో ఎవరికైనా ఇంతకు ముందు గుండె జబ్బు ఉంటే అది రెండో తరానికి చేరుతుంది. ఈ సమస్య ఎవరి అదుపులో ఉండదు. ఎందుకంటే జన్యుపరమైన కారణాల వల్ల ఒక వ్యక్తి ఈ వ్యాధికి గురవుతాడు. వైద్యుల ప్రకారం.. హైపర్ కొలెస్టెరోలేమియా అనేది చిన్న వయస్సులోనే కొంతమందిలో ఉండే జన్యుపరమైన వ్యాధి. దీని కారణంగా చిన్న వయస్సులోనే LDL కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా గుండెపోటు ప్రమాదం ఉంటుంది.

ఆహారంలో తక్కువ నూనె వాడాలి. రోజూ కనీసం అరగంట పాటు సైక్లింగ్, జాగింగ్ లేదా ఏదైనా వ్యాయామం చేయాలి. పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఆరు నుంచి ఎనిమిది నెలలకు ఒకసారి గుండె పరీక్ష చేయించుకోవాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు యోగా, మెడిటేషన్‌ ద్వారా కంట్రోల్‌ చేయాలి. వీటన్నింటితో పాటు తగినంత నిద్ర కూడా అవసరం.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Dry Fruits: ఈ డ్రై ఫ్రూట్స్‌తో సులభంగా బరువు తగ్గొచ్చు.. డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే..

Viral Photos: హాలీవుడ్ హల్క్‌ సినిమా చూశారా.. ఇప్పుడు నిజ జీవితంలో హల్క్‌ని చూడండి..!

LIC Policy: ప్రతి నెల రూ.51,000 పెన్షన్.. ఉన్నన్ని రోజులు భర్తకి.. ఆ తర్వాత భార్యకి పెన్షన్..!