ఆ సమయంలో తాటికల్లు తాగితే అద్భుత ప్రయోజనాలు !! వీడియో

గ్రామాల్లో ఉన్నవారు తాటికల్లుని దివ్య ఔషధంగా భావిస్తారు. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

Phani CH

|

Mar 05, 2022 | 8:23 PM

గ్రామాల్లో ఉన్నవారు తాటికల్లుని దివ్య ఔషధంగా భావిస్తారు. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే పూర్వీకులు తాటిచెట్టుని కల్పవృక్షంగా చెప్పేవారు. ప్రతి ఆరోగ్య సమస్యకి కల్లు ద్వారానే పరిష్కారం వెతుక్కునేవారు. కల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. కానీ ఏదైనా అతిగా సేవిస్తే ప్రమాదమే కదా.. ఈ షరతు తాటికల్లుకి కూడా వర్తిస్తుంది. అయితే తాటికల్లుని ఎప్పుడు ఎంత మోతాదులో తాగాలో తెలుసుకుంటే ప్రమాదాలనుంచి తప్పించుకోవచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న ఓ సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్‌ కారకాన్ని నాశనం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చెట్టు నుంచి తీయగానే తాగితే ఈ ఫలితాలు అందుతాయట. కొన్ని గంటలు తర్వాత తాగితే అది పులిసిపోయి ఆల్క్‌హాల్‌గా మారిపోతుంది కనుక దాన్ని తాగితే ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు. అందుచేత చెట్టు నుంచి తీసిన కల్లునే.. తీసిన వెంటనే మాత్రమే తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.

Also Watch:

ఈ బుడతడు మామూలోడు కాదు !! రెండేళ్ల వయసులోనే పైలట్‌గా !! వీడియో

వామ్మో… హై హీల్స్‌ వేసుకుని తాడు మీద జంపింగ్.. గిన్నిస్ రికార్డు కొట్టేసిందిగా !! వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu