IND vs PAK, Highlights, ICC Women’s World Cup 2022: 107 పరుగుల తేడాతో మిథాలీ సేన విజయం.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా

Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Mar 08, 2022 | 3:01 PM

IND W vs PAK W, Highlights in Telugu: టీమిండియా విధించిన 245 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక పాకిస్తాన్ జట్టు కేవలం 43 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 107 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం సాధించింది.

IND vs PAK, Highlights, ICC Women’s World Cup 2022: 107 పరుగుల తేడాతో మిథాలీ సేన విజయం.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా
India Vs Pakistan Jhulan Goswami

ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పాకిస్థాన్‌పై 107 పరుగుల తేడాతో విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ కేవలం 43 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. సిద్రా అమిన్ (30) టాప్ స్కోరర్. భారత్ తరఫున రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లు పడగొట్టింది.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. జట్టు తరపున స్నేహ రాణా, పూజా వస్త్రాకర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. పూజ 59 బంతుల్లో 67 పరుగులు చేసింది. అదే సమయంలో స్నేహ బ్యాటింగ్‌లో 53 పరుగులు వచ్చాయి. స్మృతి మంధాన కూడా 52 పరుగులు చేసింది.

పాకిస్థాన్ ప్లేయింగ్ XI: జవేరియా ఖాన్, సిద్రా అమీన్, బిస్మా మరూఫ్ (కెప్టెన్), ఒమానియా సోహైల్, నిదా దార్, అలియా రియాజ్, ఫాతిమా సనా, సిద్రా నవాజ్, డయానా బేగ్, నష్రా సంధు, అనమ్ అమీన్

ఇండియా ప్లేయింగ్ XI: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్ (కెప్టెన్), రిచా ఘోష్, స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్.

Key Events

భారత్, పాకిస్థాన్ మధ్య వన్డే పోరు

వన్డే క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మహిళల జట్లు ఇప్పటి వరకు 10 సార్లు తలపడ్డాయి. మిథాలీ రాజ్ సారథ్యంలో భారత్ ఈ 10 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించింది.

మహిళల ప్రపంచకప్‌ పోరు

మహిళల ప్రపంచకప్‌లోని పిచ్‌పై భారత్, పాకిస్థాన్‌లు మూడు సార్లు తలపడగా, మూడింటిలోనూ భారత్ విజయం సాధించింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 06 Mar 2022 01:18 PM (IST)

    టీమిండియా భారీ విజయం

    2022 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచులో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులు చేసి పాక్‌ ముందు 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ కేవలం 43 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 107 పరుగుల తేడాతో విజయం సాధించి, ప్రపంచ కప్‌లో తొలి అడుగును ఘనంగా వేసింది.

  • 06 Mar 2022 01:09 PM (IST)

    9 వికెట్లు కోల్పోయిన పాక్..

    పాకిస్తాన్ టీం ఓటమి దిశగా సాగుతోంది. ఇప్పటికే 9 వికెట్లు పడిపోవడంతో పాక్ పరాజయం ఖాయమైంది. అయితే ఎంత తేడాతో ఓడిపోనుందో చూడాలి. దైనా 19, ఆనం అమిన్ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా విజయం సాధించాలంటే మరో వికెట్ తీయాల్సి ఉండగా, పాక్ 52 బంతుల్లో 113 పరుగులు చేయాల్సి ఉంది.

  • 06 Mar 2022 12:42 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన పాక్..

    పాకిస్తాన్ టీంను కష్టాలు వదలడం లేదు. వరుసగా వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా పయణిస్తోంది. గైక్వాడ్ బౌలింగ్‌లో ఫాతిమా(17) పెవిలియన్ చేరింది. దీంతో ఏడో వికెట్‌ను పాక్ కోల్పోయింది. పాక్ ప్రస్తుతం 34 ఓవర్లకు 7 వికట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే 96 బంతుల్లో 141 పరుగులు చేయాల్సి ఉంది.

  • 06 Mar 2022 12:05 PM (IST)

    ప్రపంచ రికార్డుకు మరో 2 వికెట్ల దూరంలో గోస్వామి

    భారత ఉమెన్స్ సీనియర్ బౌలర్ ఝలన్ గోస్వామి పాకిస్తాన్ మ్యాచులో సత్తా చాటుతోంది. రెండు వికెట్లు పడగొట్టి పాక్‌ను పీకల్లోతూ కష్టాల్లోకి నెట్టింది. ఇదే క్రమంలో ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సాధించేందుకు సిద్ధమైది. మరో రెండు వికెట్లు తీస్తే గోస్వామి(38) ఈ లిస్టులో తొలి స్థానంలో నిలవనుంది.

    India Vs Pakistan Jhulan Goswami

    India Vs Pakistan Jhulan Goswami

  • 06 Mar 2022 11:53 AM (IST)

    నాలుగు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్..

    పాకిస్తాన్ టీం ఆది నుంచి పరుగులు సాధించడంలో ఇబ్బందులు పడుతోంది. దీనికి తోడు వరుసగా వికెట్లు కూడా కోల్పోతూ మరింత కష్టాల్లోకి కూరుకపోతోంది. బిస్మా మరూఫ్(15), ఒమైమా సోహైల్(5), సిద్రా అమీన్ (30) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం పాకిస్తాన్ టీం 21.2 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఝలన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, స్నేహ రాణా తలో వికెట్ పడగొట్టారు.

    India Vs Pakistan Omaima Sohail, Maroof, Sidra Ameen Out

    India Vs Pakistan Omaima Sohail, Maroof, Sidra Ameen Out

  • 06 Mar 2022 11:16 AM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్..

    రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో జవేరియా ఖాన్(11) పెవిలియన్ చేరింది. దీంతో భారత్ తొలి వికెట్‌ను సాధించింది. ప్రస్తుతం పాకిస్తాన్ 12 ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి 33 పరుగులు చేసింది.

    India Vs Pakistan Javeria Khan Out

    India Vs Pakistan Javeria Khan Out

  • 06 Mar 2022 09:58 AM (IST)

    పాక్ టార్గెట్ 245

    ఉమెన్స్ ప్రపంచ కప్ 2022లో టీమిండియా తన తొలి మ్యాచులో అద్భుతంగా పునరాగమనం చేసి ఆకట్టుకుంది. ఓ దశలో 100 పరుగులకే సగంపైగా వికెట్లు కోల్పోయిన దశలో పుజా, స్నేహ్ రాణా అద్భుతం హాఫ్ సెంచరీలతో భారత్‌ను పటిష్ట స్థితికి చేర్చారు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు సాధించింది. దీంతో పాకిస్తాన్ మందు 245 పరుగుల టార్గెన్‌ను ఉంచింది.

  • 06 Mar 2022 09:42 AM (IST)

    100 పరుగుల భాగస్వామ్యం..

    పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా కీలక భాగస్వామ్యంతో టీమిండియాకు పోరాడు స్కోర్‌ను అందించారు. 100 పరుగుల భాగస్వామ్యంతో భారత స్కోర్‌ను 200 దాటించారు. ఈ క్రమంలో పూజా 47 బంతుల్లోనే ప్రపంచకప్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసింది.

  • 06 Mar 2022 09:21 AM (IST)

    పూజ-స్నేహ్‌ల అర్ధ సెంచరీ భాగస్వామ్యం..

    డయానా బేగ్ 41వ ఓవర్ వేసింది. ఆ ఓవర్ తొలి బంతికి స్నేహ రాణా ఫోర్ బాదింది. దీంతో వీరిద్దరి మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యం పూర్తయింది. ఈ సమయంలో భారత్‌కు ఇలాంటి కీలక భాగస్వామ్యం అవసరం. వీరిద్దరు కలిసి టీమిండియాను పోరాడే స్కోర్‌కు చేర్చేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. 42 ఓవర్ల తర్వాత భారత్ స్కోరు – 185/6

  • 06 Mar 2022 09:03 AM (IST)

    మిథాలీ రాజ్ ఔట్

    34వ ఓవర్లో నషారా సంధు.. మిథాలీ రాజ్‌ను అవుట్ చేసింది. పాయింట్ దిశగా షాట్ ఆడిన మిథాలీ, డయానా బాగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. 36 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసిన మిథాలీ.. తీవ్రంగా నిరాశపరిచింది.

  • 06 Mar 2022 08:34 AM (IST)

    ఐదో వికెట్ డౌన్..

    భారత్ వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లోకి చేరుకుంటోంది. రిచా ఘోష్(1) ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరింది. దీంతో భారతమంతా సారథి మిథాలీరాజ్ పైనే నిలిచింది.

  • 06 Mar 2022 08:25 AM (IST)

    నాలుగో వికెట్ డౌన్..

    భారత్ వరుసగా వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలో కూరుకపోతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్‌(4) నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరడంతో భారతమంతా సారథి మిథాలీరాజ్ పైనే నిలిచింది.

  • 06 Mar 2022 08:20 AM (IST)

    స్మృతి మంధాన ఔట్

    దీప్తి శర్మ తర్వాత స్మృతి మంధాన కూడా పెవిలియన్ చేరింది. స్మృతి డ్రైవ్ చేయడానికి ప్రయత్నించి, అనమ్ అమీన్‌ చేతికి చిక్కింది. మంధాన 75 బంతుల్లో 52 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఒక సిక్స్, మూడు ఫోర్లు ఉన్నాయి.

  • 06 Mar 2022 08:00 AM (IST)

    మంధాన హాఫ్ సెంచరీ..

    మంధాన(50) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటోంది. తొలి వికెట్ కోల్పోయిన తరువాత దీప్తి శర్మతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించిన మంధాన.. 71 బంతుల్లో 50 పరుగులు సాధించింది. పాక్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది.

  • 06 Mar 2022 07:58 AM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా

    టీమిండియా కీలక భాగస్వామ్యానికి పాక్ బౌలర్లు బ్రేక్ చేశారు. దీప్తి శర్మ(40)ను బౌల్డ్ చేయడంలో 96 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్‌ను కోల్పోయింది.

  • 06 Mar 2022 07:52 AM (IST)

    20 ఓవర్లకు స్కోర్..

    20 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. మంధాన 47, దీప్తి 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 06 Mar 2022 07:50 AM (IST)

    16 ఓవర్లలో 65 పరుగులు చేసిన భారత్..

    16 ఓవర్లకు భారత్ ఒక వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. మంధాన 54 బంతుల్లో 37 పరుగులు చేయగా, దీప్తి శర్మ 38 బంతుల్లో 22 పరుగులు చేసింది.

  • 06 Mar 2022 07:21 AM (IST)

    50 పరుగులకు చేరిన భారత స్కోర్

    12 ఓవర్లు ముగిసే సరికి భారత స్కోర్ 50 పరుగులు దాటింది.  మంధాన 30, దీప్తి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో దైనా ఓ వికెట్ దక్కించుకుంది.

  • 06 Mar 2022 07:09 AM (IST)

    వేగం పెంచిన టీమిండియా

    తొలి వికెట్ కోల్పోయిన తరువాత టీమిండియా ఆచితూచి ఆడుతోంది.. దీప్తి శర్మ, స్మృతి మంధాన భారత ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టే పనిలో పడ్డారు. 10 ఓవర్లు ముగిసే సరికి 1 వికెట్ కోల్పోయి 33 పరుగులు చేశారు.

  • 06 Mar 2022 06:22 AM (IST)

    భారత్-పాకిస్థాన్ ప్లేయింగ్ XI

    ఈ మ్యాచ్‌లో భారత్‌, పాకిస్థాన్‌లు 5గురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నాయి. రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ కూడా సమానంగానే ఉంది.

    పాకిస్థాన్ ప్లేయింగ్ XI: జవేరియా ఖాన్, సిద్రా అమీన్, బిస్మా మరూఫ్ (కెప్టెన్), ఒమానియా సోహైల్, నిదా దార్, అలియా రియాజ్, ఫాతిమా సనా, సిద్రా నవాజ్, డయానా బేగ్, నష్రా సంధు, అనమ్ అమీన్

    ఇండియా ప్లేయింగ్ XI: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్ (కెప్టెన్), రిచా ఘోష్, స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్.

  • 06 Mar 2022 06:18 AM (IST)

    టాస్‌పై మిథాలీ ‘రహస్యం’

    టాస్ గెలిచిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అంటే పాక్ జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది. అయితే, టాస్ ఓడిపోయిన తర్వాత, పాక్ కెప్టెన్ తాను కూడా మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నట్లు అంగీకరించింది. 5గురు బౌలర్లతో ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు బరిలోకి దిగాయి.

Published On - Mar 06,2022 6:13 AM

Follow us
రూల్స్ బ్రేక్ చేస్తున్న నయనతార.! ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్..
రూల్స్ బ్రేక్ చేస్తున్న నయనతార.! ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్..
భారత్‌లో రికార్డ్‌ సృష్టిస్తున్న యాపిల్‌ కంపెనీ..
భారత్‌లో రికార్డ్‌ సృష్టిస్తున్న యాపిల్‌ కంపెనీ..
బాలయ్యతో వన్స్‌మోర్.. ఆహా అన్‌స్టాపబుల్‌లో శ్రీలీల..
బాలయ్యతో వన్స్‌మోర్.. ఆహా అన్‌స్టాపబుల్‌లో శ్రీలీల..
సినీ నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు.. వివాహితతో అక్రమ సంబంధం?
సినీ నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు.. వివాహితతో అక్రమ సంబంధం?
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పింక్ బాల్ టెస్ట్‌కి రంగం సిద్ధం
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పింక్ బాల్ టెస్ట్‌కి రంగం సిద్ధం
కరివేపాకుతో బరువు తగ్గడమే కాదు.. బోలెడు లాభాలు.. అవేంటో తెలుసా?
కరివేపాకుతో బరువు తగ్గడమే కాదు.. బోలెడు లాభాలు.. అవేంటో తెలుసా?
టెక్సాస్‌లో మరో హిందూ ఆలయం హరిహర క్షేత్రం.. తాత్కలికంగా బాలాలయం..
టెక్సాస్‌లో మరో హిందూ ఆలయం హరిహర క్షేత్రం.. తాత్కలికంగా బాలాలయం..
వామ్మో.! తుఫాన్ గండం.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
వామ్మో.! తుఫాన్ గండం.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
వేలానికి ముందు జీరో.. అమ్ముడైన వెంటనే సెంచరీ హీరో
వేలానికి ముందు జీరో.. అమ్ముడైన వెంటనే సెంచరీ హీరో
’నా ఉద్దేశం ప్రకారం ఆయనే ముఖ్యమంత్రి‘ : సంజయ్ రౌత్
’నా ఉద్దేశం ప్రకారం ఆయనే ముఖ్యమంత్రి‘ : సంజయ్ రౌత్
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్