IND vs SL: ఆ విషయంలో రోహిత్, ద్రవిడ్‌ల తప్పేం లేదు.. అసలేం జరిగిందంటే: విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జడ్డూ

మొహాలీ టెస్టు రెండో రోజున రవీంద్ర జడేజా 175 పరుగులు చేశాడు. ఇది టెస్టు క్రికెట్‌లో అతని రెండో సెంచరీ. అలాగే అతని టెస్టు కెరీర్‌లో అత్యధిక స్కోరుగా నిలిచింది.

IND vs SL: ఆ విషయంలో రోహిత్, ద్రవిడ్‌ల తప్పేం లేదు.. అసలేం జరిగిందంటే: విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జడ్డూ
Ind Vs Sl Ravindra Jadeja
Follow us
Venkata Chari

|

Updated on: Mar 06, 2022 | 7:03 AM

భారతదేశం వర్సెస్ శ్రీలంక మధ్య మొహాలీ టెస్ట్ రెండో రోజు (India vs Sri Lanka Mohali Test Day 2)రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సత్తా చాటాడు. శనివారం, మార్చి 5, మ్యాచ్ రెండవ రోజు, భారత క్రికెట్ జట్టులో(Indian Cricket Team)ని ఈ స్టార్ ఆల్ రౌండర్ చిరస్మరణీయమైన, రికార్డ్ ఇన్నింగ్స్ ఆడి చరిత్ర సృష్టించాడు. ఎప్పుడూ బంతితో ఆకట్టుకునే జడేజా తన కెరీర్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడుతూ అజేయంగా 175 పరుగులు చేశాడు. అతను డబుల్ సెంచరీకి చేసే అవకాశం ఉంది. కానీ, డబుల్ సెంచరీ పూర్తి చేయడానికి అతనికి ఎందుకు అవకాశం ఇవ్వలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భారత జట్టు 574/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈమేరకు జడేజా మాట్లాడుతూ, పిచ్ నుంచి వచ్చే సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలనేది తన సూచనే అంటూ విమర్శలకు సమాధానమిచ్చాడు.

మ్యాచ్‌లో తొలిరోజు అర్ధసెంచరీతో అజేయంగా నిలిచిన జడేజా.. శనివారం పీసీఏ స్టేడియంలో తన ఇన్నింగ్స్‌ను పొడిగిస్తూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 228 బంతుల్లో తన మొత్తం ఇన్నింగ్స్‌లో శ్రీలంక బౌలర్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. మొదట తన కెరీర్‌లో రెండో టెస్టు సెంచరీ సాధించిన అతను రెండో సెషన్‌లో పరుగుల వేగాన్ని పెంచాడు. ఈ సమయంలో, అతను మొదట రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని చేశాడు. టి-బ్రేక్‌కు ముందు, జడేజా డబుల్ సెంచరీ దిశగా వెళుతున్న సమయంలో, కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో విమర్శలు వచ్చాయి. జడేజాను డబుల్ సెంచరీ చేయకుండా అడ్డుకున్నారంటూ కోచ్ ద్రవిడ్, కెస్టెన్ రోహిత్ శర్మను నెటిజన్లు ఏకిపారేశారు. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత రవీంద్ర జడేజా అసలు విషయం వెల్లడించాడు.

ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలని జట్టుకు సూచించిన జడేజా.. జడేజా బ్యాటింగ్‌ తీరు, షమీ దూకుడు చూస్తుంటే.. కొన్ని ఓవర్లలోనే తొలి డబుల్‌ సెంచరీ సాధిస్తాడని అనిపించినా అది కుదరలేదు. ఇటువంటి పరిస్థితిలో, రెండో రోజు ఆట ముగిసిన తరువాత జడేజా మాట్లాడాడు. “పిచ్‌పై ‘వేరియబుల్ బౌన్స్’ ఉందని, బంతులు తిరగడం ప్రారంభించాయని నేను జట్టుకు చెప్పాను. కాబట్టి పిచ్ నుంచి కొంత సహాయం పొందవచ్చని నేను సందేశం పంపాను. శ్రీలంకను ఇప్పుడు బ్యాటింగ్‌కి తీసుకురావాలని సూచించాను’ అని చెప్పుకొచ్చాడు.

శ్రీలంక అలసట నుంచి ప్రయోజనం పొందాలనే.. శ్రీలంక ఆటగాళ్లు ఎక్కువసేపు మైదానంలో ఉండటం వల్ల అలసటను కూడా జట్టు సద్వినియోగం చేసుకోవాలని జడేజా ప్లాన్ చేశాడు. భారత ఆల్ రౌండర్ మాట్లాడుతూ, “ఇప్పటికే రెండు రోజుల్లో మొత్తం 5 సెషన్ల పాటు ఫీల్డింగ్ చేయడంలో వారు అలసిపోయారు. కాబట్టి వచ్చిన వెంటనే భారీ షాట్లు ఆడడం, ఎక్కువసేపు బ్యాటింగ్ చేయడం వారికి అంత సులువు కాదు. తద్వారా ఇన్నింగ్స్‌ను ముందుగానే డిక్లేర్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ అలసటను సద్వినియోగం చేసుకోవాలనేది ప్లాన్’ అంటూ పేర్కొన్నాడు.

జడ్డూ వికెట్ కూడా తీశాడు.. భారత జట్టుతో జడేజా చేసిన ఈ ప్రణాళిక కూడా పనిచేసింది. చివరి సెషన్‌లో శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో జట్టు 4 వికెట్లు పడిపోయాయి. దీనిలో జడేజా స్వయంగా శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నేను అద్భుతమైన స్పిన్‌తో పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్‌కు సంబంధించి మాట్లాడుతూ.. “బంతిని స్టంప్‌పై ఉంచాలని ప్లాన్ చేసాం. అదే జరిగింది. నా మొదటి బంతి టర్న్ అయ్యింది. రెండవ బంతికి నేను నాలుగో స్టంప్ వద్ద బౌలింగ్ చేస్తానని అనుకున్నాను. అది మలుపు తిరిగినా లేదా తక్కువకు వెళ్లినా వికెట్ తీయడానికి ఎల్లప్పుడూ అవకాశం ఉంది’ అని తెలిపాడు.

Also Read: IND vs PAK, LIVE Score, ICC Women’s World Cup 2022: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. షెఫాలీ వర్మ ఔట్

IND vs SL: జడ్డూ ఖాతాలో అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన ‘సర్ జడేజా’..