Eye Care During Pregnancy: ఆ సమయంలో కంటి సమస్యలతో ఇబ్బంది.. గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

కాబోయే తల్లులు వారి శ్రేయస్సు వివిధ అంశాలపై దృష్టి సారిస్తుండగా, వారి కళ్ల ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో సహాయపడే కొన్ని విలువైన చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు.

Eye Care During Pregnancy: ఆ సమయంలో కంటి సమస్యలతో ఇబ్బంది.. గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
Pregnant
Follow us
Srinu

|

Updated on: Jun 26, 2023 | 8:00 PM

అమ్మతనం అనేది ప్రతి మహిళకు పెద్ద ఎమోషన్. పెళ్లి అయిన ప్రతి మహిళ గర్భం అనేది స్త్రీ జీవితంలో ఒక ప్రత్యేక సమయంగా భావిస్తారు. ఈ సమయంలో సరైన సంరక్షణ, ఆరోగ్యంపై కీలకం శ్రద్ధ కీలకం. కాబోయే తల్లులు వారి శ్రేయస్సు వివిధ అంశాలపై దృష్టి సారిస్తుండగా, వారి కళ్ల ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో సహాయపడే కొన్ని విలువైన చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ సమయంలో కంటి వైద్యునితో రెగ్యులర్ కంటి చెకప్‌లను షెడ్యూల్ చేయడం చాలా అవసరం. హార్మోన్ల మార్పులు, కంట్లోని ద్రవం నిలుపుదల దృష్టిని ప్రభావితం చేయవచ్చు. కంటి సంరక్షణ నిపుణుడు ఏవైనా మార్పులను పర్యవేక్షించవచ్చు. గర్భధారణ మధుమేహం వంటి పరిస్థితుల ముందస్తు సంకేతాలను గుర్తించవచ్చు.

సమతుల్య ఆహారం 

అవసరమైన ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉండే పోషకాహారం మొత్తం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కంటి ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. మీ ఆహారంలో సిట్రస్ పండ్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగిన చేపలు, ఆకు కూరలు, గింజలు వంటి ఆహారాలను ఎల్లప్పుడూ చేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఆహారాల్లో విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన దృష్టికి మద్దతునిస్తాయి.

హైడ్రేటెడ్‌గా ఉండడం

గర్భిణులు సరైన హైడ్రేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇది కంటి పొడి, చికాకును నివారించడంలో సహాయపడుతుంది. రోజంతా తగినంత మొత్తంలో నీరు తాగడం వల్ల కళ్ళు హైడ్రేట్‌గా ఉంటాయి. అదనంగా పొడిగా ఉండడం వల్ల కలిగే ఏదైనా అసౌకర్యాన్ని తగ్గించడానికి ప్రిజర్వేటివ్-రహిత కృత్రిమ కన్నీళ్లు లేదా లూబ్రికేటింగ్ కంటి చుక్కలను ఉపయోగించడాన్ని పరిగణించాలి. తగిన కంటి చుక్కల సిఫార్సుల కోసం నేత్ర వైద్యుడిని సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

కంటి విశ్రాంతి 

ఎక్కువ కాలం స్క్రీన్ సమయం చూపడం వల్ల కళ్లకు ఇబ్బంది అవుతుంది. డిజిటల్ స్క్రీన్లు కంటి ఒత్తిడికి దారి తీయవచ్చు. గర్భిణులు ఎలక్ట్రానిక్ పరికరాల నుండి క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలి. 

యూవీ కిరణాల నుంచి రక్షణ

గర్భధారణ సమయంలో సూర్యుని హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి మీ కళ్ళను రక్షించుకోవడం చాలా ముఖ్యం. హార్మోన్ల మార్పులు సూర్యరశ్మికి కళ్ళు మరింత సున్నితంగా మారతాయి. అందువల్ల మీరు ఆరుబయట ఉన్నప్పుడు వంద శాతం రక్షణను అందించే సన్ గ్లాసెస్ ధరించండి. అన్ని కోణాల నుంచి యూవీ ఎక్స్‌పోజర్‌ను తగ్గించడానికి పెద్ద ఫ్రేమ్‌లు లేదా ర్యాప్-అరౌండ్ స్టైల్స్‌తో సన్ గ్లాసెస్‌ని ఎంచుకోండి.

గర్భ ప్రేరిత కంటి పరిస్థితులు

గర్భం అనేది కంటికి సంబంధించిన కొన్ని పరిస్థితులైన పొడి కళ్ళు, ప్రీ ఎక్లంప్సియా-సంబంధిత దృశ్య అవాంతరాలు లేదా తాత్కాలిక వక్రీభవన మార్పులను తీసుకురావచ్చు. మీరు అస్పష్టమైన దృష్టి ఆకస్మిక వెలుగులు లేదా కంటికి నిరంతరం అసౌకర్యం వంటి ఏవైనా అసాధారణ లక్షణాలను అనుభవిస్తే, వెంటనే నేత్ర సంరక్షణ నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

గమనిక: ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..