Arthritis: కుయ్యోమొర్రో అంటున్న కీళ్లు.. మహిళల్లోనే ఎందుకీ సమస్య? కారణం అదేనా?
ఈ ఆర్థరైటిస్ పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పైబడిన, మోనోపాజ్ చేరుకున్న మహిళ్లలో ఆస్టియో ఆర్థరైటిస్ ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నట్లు వివరిస్తున్నారు.
ఇటీవల కాలంలో కాస్త వయసు పైబడిన వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఆర్థరైటిస్. ఇది ప్రారంభమైందంటే ఓ పట్టాన వదిలి పెట్టదు. కీళ్లు పట్టేయడం.. అడుగేస్తే విపరీతంగా సలపడం, తట్టుకులేనంత నొప్పి వస్తాయి. దీనికి వైద్యుడి సిఫార్సు మేరకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. వ్యాధి ముదిరిపోతే కొంతమందికి జాయింట్ రిప్లేస్ మెంట్ కూడా అవసరం అవ్వొచ్చు. అయితే ఈ ఆర్థరైటిస్ పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పైబడిన, మోనోపాజ్ చేరుకున్న మహిళ్లలో ఆస్టియో ఆర్థరైటిస్ ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నట్లు వివరిస్తున్నారు. అయితే పురుషులతో పోల్చితే మహిళల్లో ఎందుకు ఈ వ్యాధి అధికంగా వస్తుంది. దీనికి ఏమైనా కారణాలున్నాయా? అది ఆర్థరైటిస్ అని ఎలా నిర్ధారించాలి? చూద్దాం రండి..
ఈ కారణాలు కావొచ్చు..
వివిధ కారణాల వల్ల ఆర్థరైటిస్‌కు గురయ్యే అవకాశం పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా ఉంటుంది. హార్మోన్ల మార్పులు, శరీర నిర్మాణ వ్యత్యాసాలు, జీవనశైలి, వారసత్వం వంటి అనేక అంశాలు ఆర్థరైటిస్ వచ్చే అవకాశాన్ని పెంచవచ్చు. అదే విధంగా ఆరోగ్యకరమైన శరీర బరువు, మితమైన వ్యాయామం చేయడం, మంచి చెప్పులు ధరించడం వంటి విషయాల్లో అవగాహన కలిగి ఉండాలి. ఇవన్నీ ఆర్థరైటిస్ కు కారణాలే. వీటిపై దృష్టి పెడితే ఆర్థరైటిస్ రాకుండా నివారించవచ్చు. ఇక మహిళల్లోనే ఎందుకు అన్న విషయానికి వస్తే వీరిలో ఉండే హార్మోన్ల ప్రోఫైల్ కారణంగా కూడా ఆర్థరైటిస్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో ఈస్ట్రోజెన్ అనేది రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంతో పాటు ఇన్ ఫ్లేషన్ ను తగ్గించడంతో ముడిపడి ఉన్న ఒక హార్మోన్. స్త్రీ జీవితాంతం, ముఖ్యంగా రుతుస్రావం, గర్భం, రుతువిరతి సమయంలో సంభవించే హార్మోన్ స్థాయిలలో హెచ్చుతగ్గుల ఫలితంగా ఆర్థరైటిస్ అభివృద్ధి చెందుతుంది. అంతేకాక అది తీవ్రతరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
జన్యుపరమైన కారణాలపై అధ్యయనం..
ఒక వ్యక్తి జన్యుపరమైన అంశాలు ఆర్థరైటిస్ అభివృద్ధి చెందడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని జన్యు ఉత్పరివర్తనలు, వైవిధ్యాలు మహిళల్లో సర్వసాధారణంగా ఉంటాయి. అధ్యయనాల ప్రకారం, ఆర్థరైటిస్‌ను అభివృద్ధి కావడానికి ఈ మార్పులు కారణం కావొచ్చు. కచ్చితమైన జన్యువులను గుర్తించడానికి, అవి ఎలా గ్రహణశీలతను పెంచుతాయో తెలుసుకోవడానికి ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయని నిపుణులు వివరిస్తున్నారు.
ఆటో ఇమ్యూన్ వ్యాధి..
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో సహా అనేక రకాల ఆర్థరైటిస్‌లు ఆటో ఇమ్యూన్ అనారోగ్యాల వర్గంలోకి వస్తాయి. రోగనిరోధక వ్యవస్థ అనుకోకుండా ఆరోగ్యకరమైన శరీర కణజాలాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసినప్పుడు ఆటో ఇమ్యూన్ వ్యాధులు అభివృద్ధి చెందుతాయి. ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులు పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆర్థరైటిస్ కూడా మహిళల్లో ఎక్కువగా సంభవిస్తుందని చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..