Tomato Flu: పెరుగుతున్న టొమాటో ఫ్లూ కేసులు.. ఒకరి నుంచి మరొకరికి..

Tomato Flu: దేశంలో టొమాటో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడు తర్వాత ఒడిశాలో కూడా చాలా మంది చిన్నారులు ఈ ఫ్లూ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని చిన్నారుల్లో ..

Tomato Flu: పెరుగుతున్న టొమాటో ఫ్లూ కేసులు.. ఒకరి నుంచి మరొకరికి..
Follow us

|

Updated on: May 28, 2022 | 7:20 AM

Tomato Flu: దేశంలో టొమాటో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడు తర్వాత ఒడిశాలో కూడా చాలా మంది చిన్నారులు ఈ ఫ్లూ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని చిన్నారుల్లో వచ్చే ఫ్లూ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అధికారులు. జ్వరపీడితులు, జ్వరం ఎక్కువగా ఉన్న పిల్లలకు రక్తపరీక్షలు, ఇతర పరీక్షలు కూడా ఆసుపత్రుల్లోనే చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో టమోటా ఫ్లూ వ్యాపిస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలకు ఇది త్వరగా సోకుతుందని నిపునులు చెబుతున్నారు. టొమాటో ఫ్లూ అంటు వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో దీని కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ సమయంలో పిల్లలు జ్వరంతో బాధపడుతున్నట్లయితే, వారికి సొంతంగా మందులు ఇవ్వకుండా వైద్యులను సంప్రదించండం మంచిదంటున్నారు.

న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లోని పీడియాట్రిక్స్ అండ్ ప్రివెన్షన్ విభాగానికి చెందిన డాక్టర్ అమోల్‌కుమార్ లోకాడే, టొమాటో ఫ్లూపై మాట్లాడారు. ఈ వైరస్‌ సోకడానికి గల కారణాలపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదని అన్నారు. అయితే ఇది ఏదో వైరస్ కారణంగా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు. ఈ వైరస్ చికెన్, స్మాల్ పాక్స్ లాగా ఉంటుంది. టొమాటో ఫ్లూ ఒక అంటు వ్యాధి. ఇది సోకిన పిల్లల నుంచి ఇతర పిల్లలకు వ్యాపించే అవకాశం ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అయితే ఇది కరోనా వైరస్ అంత ప్రమాదకరం కాదు.. అందుకే పిల్లలకు ఈ ఫ్లూ సోకితే తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

ఇవి కూడా చదవండి

పిల్లలకి జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్ ఉంటే, ఇతర పిల్లల నుండి వేరుగా ఉంచాలని డాక్టర్ చెప్పారు. పిల్లల జ్వరం మూడు నుండి ఐదు రోజుల వరకు కొనసాగితే, అతనికి పరీక్ష చేయించండి. టొమాటో ఫ్లూ విషయంలో మొదట జ్వరం వస్తుంది. ఆ తర్వాత శరీరంలో ఎరుపు రంగు దద్దుర్లు రావడం మొదలవుతుంది. ఇందులో ద్రవం కూడా ఉండవచ్చు. ఈ దద్దుర్లను ముట్టుకోవద్దు. ఈ ఫ్లూ పిల్లల శరీరంలో ఏడు నుంచి 14 రోజుల వరకు ఉంటుంది. ఈ సమయంలో అతనికి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు కూడా ఉండవచ్చు. దీనిని నివారించడానికి, ఇంట్లో శుభ్రతపై శ్రద్ధ వహించడం అవసరం. పిల్లల శరీరంలో నీటి కొరత ఉండనివ్వవద్దు. ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే పిల్లలకు దూరంగా ఉంచి టొమాటో ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి