AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papaya Benefits: బాలింతలు బొప్పాయిని తినొచ్చా..? ఈ వ్యాధులకు మంచి ఔషధం..!

Papaya Benefits: ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ ఒత్తిళ్లు, మానసిక ఆందోళన, ఆహారంలో మార్పులు, జీవన శైలిలోమార్పుల కారణంగా మనిషి అనారోగ్యం బారిన..

Papaya Benefits: బాలింతలు బొప్పాయిని తినొచ్చా..? ఈ వ్యాధులకు మంచి ఔషధం..!
Subhash Goud
|

Updated on: May 27, 2022 | 4:20 PM

Share

Papaya Benefits: ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ ఒత్తిళ్లు, మానసిక ఆందోళన, ఆహారంలో మార్పులు, జీవన శైలిలోమార్పుల కారణంగా మనిషి అనారోగ్యం బారిన పడుతున్నాడు. అయితే కొన్ని పండ్లను తీసుకోవడం వల్ల ఎంతో మేలు ఉంటుంది. ఇక ఏడాది పొడవునా దొరికి పండ్లలో బొప్పాయి. ఇందులో విటమిన్‌-ఎ,బి,సి,ఇ మాత్రమే కాదు.. మెగ్నీషియం, పొటాషియం, ఫొలేట్‌, లినోలియెక్‌ యాసిడ్‌, ఆంథాసిన్లు, బీటా కెరోటిన్లు, ఫ్లేవనాయిడ్స్‌, డైటరీ ఫైబర్స్‌ లాంటివి ఉంటాయి. అందుకే బొప్పాయి అనేక వ్యాధులకు మందులా పనిచేస్తుంది. గాయాలను తగ్గిస్తుంది. కిడ్నీలతో పాటు కళ్లకు, జుట్టుకు మేలుచేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులు దరిచేరకుండా చేస్తుంది.

బాలింతలకు పాలు సమృద్ధిగా వచ్చేందుకు పచ్చి బొప్పాయి కాయ కూరను వడ్డిస్తారు. ఇందులో పీచు పదార్థాలు, శక్తినిచ్చి పోషకాలుంటాయి. బీటా కెరోటిన్లుగా పిలిచే వర్ణద్రవ్యాలతో పాటు, యాంటీ ఆక్సిడెంట్లు అయిన లైకోపీన్‌లూ అధికమే. బొప్పాయి ఆకుల రసాన్ని డెంగ్యూ, మలేరియా, నెలసరి నొప్పులు, చర్మ వ్యాధులు, గుండెమంట, కేశ సమస్యలు, మధుమేహం, హైపర్‌టెన్షన్‌ పరిష్కారానికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. బొప్పాయి గింజల్లో భాస్వరం, ఇనుము, మెగ్నీషియం, క్యాల్షియం, పీచు, సంతృప్త కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అపారం. కాలేయ సమస్యలను, వివిధ క్యాన్సర్లను బొప్పాయి గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.

బీపీ తగ్గిస్తుంది:

ఇవి కూడా చదవండి

రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున బొప్పాయి తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. అంతేగాకుండా కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బొప్పాయి వేరును అరగదీసి నీటిలో కలిపి దాహం అనిపించినప్పుడల్లా తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు మాయమవుతాయి.

ఔషధంగా..

☛ అజీర్ణం, ఆకలి మందగించడం, వికారం వంటి లక్షణాలు ఉన్నప్పుడు, గుండెల్లో మంట, కడుపులో నొప్పి, ఆహారం సహించకపోవడం, నీళ్ల విరేచనాలను వెంటనే అరికడుతుంది.

☛ వేళకు భోజనం చేయకపోవడం, అతిగా భుజించడం, ఆల్కహాల్ వంటివి ఎక్కువగా తాగటం, మానసిక ఒత్తిడి, మితిమీరిన టెన్షన్ వంటివి జీర్ణకోశాన్ని నష్టపరుస్తాయి. ఇలాంటి సమయంలో బొప్పాయి పండు అమోఘంగా పనిచేస్తుంది.

☛ బొప్పాయి కాయలను కూరగా వండుకుని రెండు వారాలు తింటే జీర్ణకోశ వ్యాధులు నయమవుతాయి.

☛ బొప్పాయిలో ఫాస్పరస్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీనిద్వారా మనిషి ఎదుగుదలకు, కళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

☛ ఆకలి లేకపోవటం, బలహీనత వంటి వాటికి బొప్పాయి అరచెక్కను తింటే ఆకలి పెరగడమే కాకుండా బలహీనత తగ్గుతుంది. ఒక స్పూను బొప్పాయి పాలను తీసుకున్నా ఆకలి పుడుతుంది.

సౌందర్య సాధనంగా..

☛ బొప్పాయిపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, నునుపుగా చేస్తుంది.

☛ బ్యూటీక్రీమ్‌లు, బ్యూటీ లోషన్లలో పండును ఎక్కువగా వాడతారు.

☛ బొప్పాయి చెట్టు పాలు చర్మ సంరక్షణకు లోషన్‌గా ఉపయోగపడుతాయి.

☛ బొప్పాయి కాయలను బాగా ఎండబెట్టి, పొడిగా మార్చి, ఉప్పు కలుపుకుని తింటే చర్మం అందంగా తయారవుతుంది.

☛ బొప్పాయి గుజ్జును ముఖానికి మాస్క్‌లా నెల రోజులు చేసుకుంటే నల్లదనం తగ్గి రంగు తేలుతుంది.

☛ బొప్పాయి పండు, ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే మేలు చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఈ అంశాలను అనుసరించే ముందు వైద్యులను సంప్రదించండి.)