పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
Krishna
30 May 2026
పుచ్చకాయ చాలా త్వరగా జీర్ణమయ్యే పండు. అయితే దీనితో పాటు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే కొన్ని ఆహారాలను తిన్నప్పుడు జీర్ణవ్యవస్థ గందరగోళానికి గురవుతుంది. పొట్టలో గ్యాస్, ఎసిడిటీ వస్తాయి.
గ్యాస్, ఎసిడిటీ ముప్పు
ఆయుర్వేద నిపుణులు పుచ్చకాయను పాలతో కలిపి ఎట్టిపరిస్థితుల్లోనూ తినవద్దని గట్టిగా సలహా ఇస్తారు. పుచ్చకాయ తిన్న వెంటనే పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మందగించి, కడుపు ఉబ్బరంగా అనిపించడంతో పాటు పొట్ట భారంగా అనిపిస్తుంది
పాలతో వద్దు
పెరుగు, పుచ్చకాయలను కలిపి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ రెండింటి కలయిక శరీరంలో వేడి,చల్లని ఉష్ణోగ్రతల అసమతుల్యతకు కారణమవుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది
పెరుగుతో
నూనెలో ఎక్కువగా వేయించిన ఆహారపదార్థాలతో పాటు పుచ్చకాయ తినడం జీర్ణవ్యవస్థ సమతుల్యతను పూర్తిగా దెబ్బతీస్తుంది. పుచ్చకాయ క్షణాల్లో అరిగిపోతుంది, కానీ నూనె పదార్థాలు అరగడానికి గంటల సమయం పడుతుంది.
ఫ్రైడ్ ఫుడ్స్
పుచ్చకాయ తిన్న వెంటనే చల్లటి కూల్ డ్రింక్స్ తాగడం లేదా ఐస్ వాటర్ తాగడం చాలా హానికరం. ఇది జీర్ణక్రియ ప్రక్రియను స్తంభింపజేసి, పొట్టలో తీవ్రమైన అసౌకర్యానికి కారణమవుతుంది.
కూల్ డ్రింక్స్
పుచ్చకాయలోనే దాదాపు 90శాతం వరకు నీరే ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ తిన్న వెంటనే విడిగా నీరు తాగడం వల్ల పొట్టలోని జీర్ణరసాలు పలచబడి అజీర్ణానికి దారితీస్తాయి. అందుకే పుచ్చకాయ తిన్న తర్వాత నీరు తాగకూడదు
నీరు తాగకూడదు
చాలా మంది ఏ ఆహారంతోనైనా పుచ్చకాయను సైడ్ డిష్‌గా లేదా డెజర్ట్‌గా కలిపి తినేస్తుంటారు. కానీ ఈ అలవాటు దీర్ఘకాలిక కడుపు సంబంధిత సమస్యలకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సైడ్ డిష్‌గా
పుచ్చకాయ వల్ల పూర్తి ప్రయోజనాలు అందాలంటే దాన్ని ఒంటరిగానే ఆస్వాదించాలి. ఎలాంటి నూనె పదార్థాలు, పాల ఉత్పత్తులు లేదా కూల్ డ్రింక్స్ దీనికి జత చేయకుండా విడిగా పరిమిత పరిమాణంలో తినడమే ఆరోగ్యానికి మంచిది.