World Blood Cancer Day 2022: మీ పిల్లలలో ఇలాంటివి కనిపిస్తున్నాయా..? జాగ్రత్త.. బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు..!
World Blood Cancer Day 2022: చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఎంతో మందిని అనేక రకాల క్యాన్సర్లు వేధిస్తున్నాయి. ..
World Blood Cancer Day 2022: చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఎంతో మందిని అనేక రకాల క్యాన్సర్లు వేధిస్తున్నాయి. అవన్నీ కూడా ప్రమాదకరమైనవి. వీటిలో ఒకటి బ్లడ్ క్యాన్సర్ . దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 28న ప్రపంచ రక్త క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. రక్త క్యాన్సర్ కారణాలు, నివారణ పద్ధతుల గురించి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. రక్త క్యాన్సర్‌ను లుకేమియా అని కూడా అంటారు. ఈ క్యాన్సర్ వృద్ధాప్యంలో మాత్రమే వస్తుందని అనుకుంటారు, కానీ అది అలా కాదు. పిల్లలలో బ్లడ్ క్యాన్సర్ కేసులు కూడా కనిపిస్తాయి. ఇది వారికి ప్రాణాంతకం కానప్పటికీ.. దాని లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా చికిత్స సులభంగా చేయవచ్చు. పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు, లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.
ఢిల్లీలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన డాక్టర్ గౌరీ కపూర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దల మాదిరిగానే పిల్లలలో కూడా అనేక రకాల క్యాన్సర్‌లు కనిపిస్తాయి. అయితే పిల్లలలో కూడా కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి. వారి లక్షణాలను సకాలంలో గుర్తించినట్లయితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. లుకేమియా అనేక కేసులు అంటే, పిల్లలలో బ్లడ్ క్యాన్సర్ కనిపిస్తుంది. పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్‌కు మందులు లేవని ప్రజల్లో ఓ అపోహ ఉంది. కానీ అలాంటిదేమి లేదు. అన్ని రకాల క్యాన్సర్లకు మందులు ఉన్నాయి. కానీ జాగ్రత్తలు పాటిస్తే మేలు. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా (ALL) అనేది పిల్లలలో వచ్చే రక్త క్యాన్సర్. దాదాపు 80 శాతం మందిలో ఇది నయమవుతుంది. పిల్లల్లో వచ్చే క్యాన్సర్లు జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయని, ఈ క్యాన్సర్‌లు DNAలో మార్పుల వల్ల వస్తాయని అపోహ కూడా ఉంది.
ఇవీ పిల్లల్లో వచ్చే క్యాన్సర్ లక్షణాలు:
☛ ఇన్ఫెక్షన్ లేకుండా ఎక్కువ రోజులు జ్వరం రావడం
☛ శరీర బలహీనత, ఆకలి లేకపోవడం
☛ పిల్లలకు త్వరగా గాయాలు కావడం, అధిక రక్తస్రావం
☛ శరీరం మీద గడ్డలు కావడం
☛ తీవ్రమైన తలనొప్పితో కూడిన వాంతులు
☛ రక్త కణాల మార్పిడి ద్వారా చికిత్స జరుగుతుంది
☛ బ్లడ్ క్యాన్సర్ అనేక సందర్భాల్లో రక్త కణాల మార్పిడి ద్వారా చికిత్స జరుగుతుంది. ఇది ఎముక మజ్జను తీసివేసి దాని స్థానంలో థెరపీ మజ్జతో చేసే పద్ధతి. అయితే దీనికి దాత అవసరం. రోగిలో క్యాన్సర్ లక్షణాలు తీవ్రరూపం దాల్చినప్పుడు ఈ పరిస్థితి వస్తుంది.
☛ శిశువు ఆహారం పట్ల శ్రద్ధ వహించండి
☛ ఆహారంలో చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉపయోగించవద్దు
☛ పిల్లలను క్రీడలు ఆడేలా ప్రోత్సహించండి. మీకు క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి