Weight Loss Tips: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? మీ నడకలో మార్పులు చేసుకుంటే మంచి ప్రయోజనం..!
Weight Loss Tips: అధిక బరువు ఉండి లావుగా కనిపిస్తే ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు. చూసిన వాళ్లు హేళన చేస్తుంటారు. అధిక బరువు అనేది డయాబెటిస్, గుండె జబ్బులకు, ఇతర వ్యాధులకు దారితీస్తుంది. అందుకే బరువును అదుపులో ఉంచుకోవాలని వైద్యులు పదేపదే చెబుతుంటారు. ఇందుకోసం చాలామంది ఆహారంలో మార్పు చేసుకుంటారు. వ్యాయమాలు కూడా చేస్తుంటారు. అయితే నడకవల్ల త్వరగా బరువు తగ్గుతారనే విషయం చాలామందికి తెలియదు. కొన్ని ట్రిక్స్ తెలుసుకుని ప్రతిరోజూ ఇలా నడిస్తే ఈజీగా అధిక […]
Weight Loss Tips: అధిక బరువు ఉండి లావుగా కనిపిస్తే ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు. చూసిన వాళ్లు హేళన చేస్తుంటారు. అధిక బరువు అనేది డయాబెటిస్, గుండె జబ్బులకు, ఇతర వ్యాధులకు దారితీస్తుంది. అందుకే బరువును అదుపులో ఉంచుకోవాలని వైద్యులు పదేపదే చెబుతుంటారు. ఇందుకోసం చాలామంది ఆహారంలో మార్పు చేసుకుంటారు. వ్యాయమాలు కూడా చేస్తుంటారు. అయితే నడకవల్ల త్వరగా బరువు తగ్గుతారనే విషయం చాలామందికి తెలియదు. కొన్ని ట్రిక్స్ తెలుసుకుని ప్రతిరోజూ ఇలా నడిస్తే ఈజీగా అధిక బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. నడక అనేది బరువు తగ్గడంలో ఎంతగానో సహాయ పడుతుందంటున్నారు నిపుణులు. బరువు తగ్గేందుకు రకరకాల మందులు వాడుతుంటారు. అలా కాకుండా వాకింగ్‌తో మంచి ప్రయోజనం ఉంటుంది. నడక.. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో తక్కువ సహాయపడుతుందని అంతా అనుకుంటారు. సాధారణ నడక అధిక బరువును తగ్గించడంలో అత్యంత ప్రభావం చూపదని, అయితే, కొన్నిరకాల కార్డియో ట్రిక్స్ పాటిస్తూ నడిస్తే మంచి ఫలితం ఉంటుంది నిపుణులు సూచిస్తున్నారు.
☛ వాకింగ్ లంగెస్ చేయాలి..
వ్యాయమాలు చేసే సమయంలో ప్రతిసారీ కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల ఆ ప్రక్రియలో ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. లంగెస్ వాకింగ్ అనేది ఒక తీవ్రమైన వ్యాయామం. ఇందులో సుదీర్ఘంగా ముందుకు సాగుతూ, మోకాలిని నేలకు సున్నితంగా తాకించాల్సి ఉంటుంది. ఒక్కో కాలుతో 10 నుంచి 15 సార్లు లంగెస్ చేయాలి. ఇలా తక్కువ వ్యవధిలో ఎక్కువ కేలరీలు ఖర్చు చేయవచ్చు. రెండు చేతుల్లో డంబెల్స్ పట్టుకుని చేస్తే ఇంకా ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి.
☛ఎత్తుపైకి నడవండి:
ఎత్తుపైకి నడవడం వల్ల వ్యాయామం తీవ్రత పెరుగుతుంది. దీనికి ఎక్కువ శ్రమ అవసరం ఉంటుంది. తుంటి, కాళ్ల చుట్టూ కండరాలు గట్టిపడుతాయి. ఎక్కువ సంఖ్యలో కేలరీలు ఖర్చు అవుతాయి. ఎత్తైన ప్రదేశాలకు కాలినడకన చేరుకోవాలి. శిఖరాగ్రం వరకు చేరుకోవాలి. ఆ తర్వాత కిందికి నడిచి మళ్లీ, పైకి ఎక్కాలి. ఇది కండరాలు కొంచెం విశ్రాంతి తీసుకునేందుకు, మరొక రౌండ్ వ్యాయామానికి సిద్ధమయ్యేందుకు ఉపయోగపడుతుంది.
☛ నడక వేగాన్ని పెంచుతూ ఉండాలి:
ఎక్కువ సేపు ఒకే వేగంతో నడవడం వల్ల ఒకేసారి ఎక్కువ కేలరీలు ఖర్చు చేయడంలో సహాయపడకపోవచ్చు. ప్రత్యామ్నాయంగా కొన్ని నిమిషాలపాటు వేగంతో నడిచి, ఆపై వేగాన్ని తగ్గించాలి. ఇది శక్తి ఓవర్‌టైమ్‌ను మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి