Helath: ఈ విషయాలు తెలిస్తే ఉసిరి గింజలను ఇకపై అస్సలు పడేయ్యరు.. ఎన్ని లాభాలో తెలుసా.?

Helath: ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విటమిన్‌-సి పుష్కలంగా ఉండే ఉసిరి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అందుకే మన పెద్దలు ఉసిరిని..

Helath: ఈ విషయాలు తెలిస్తే ఉసిరి గింజలను ఇకపై అస్సలు పడేయ్యరు.. ఎన్ని లాభాలో తెలుసా.?
Follow us
Narender Vaitla

|

Updated on: May 28, 2022 | 6:40 AM

Helath: ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విటమిన్‌-సి పుష్కలంగా ఉండే ఉసిరి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అందుకే మన పెద్దలు ఉసిరిని ఆచారంగా అలవాటు చేశారు. జుట్టు నుంచి చర్మం వరకు ఉసిరితో కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెరగడంలో ఉసిరి పాత్ర కీలకమైంది. అందుకే కరోనా సమయంలో ఉసిరి ఎక్కువగా తీసుకోమని నిపుణులు కూడా సూచించారు.

ఇదిలా ఉంటే ఉసిరి తిన్న తర్వాత సహజంగా లోపల ఉండే గింజలను పడేస్తుంటారు. అయితే వీటివల్ల కూడా లాభాలు ఉన్నాయని మీకు తెలుసా.? ఎలాంటి ఉపయోగం లేదని పడేసే ఉసిరి గింజలతో కలిగే ఈ ప్రయోజనాలు చూస్తే ఇకపై ఆ పని అస్సలు చేయరు. ఇంతకీ ఉసిరి గింజలతో కలిగే లాభాలేంటో ఓ లుక్కేయండి..

* కొందరికి వేడి కారణంగా ముక్కులో నుంచి రక్తం స్రావం అవుతుంటుంది. మరీ ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా బయట తిరిగే వారు ఈ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఉసిరి గింజలను ఎండబెట్టి చేసిన పొడిని పేస్ట్‌గా తయారు చేసుకొని తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

* మొహంపై వచ్చే మొటిమలకు కూడా ఉసిరి గింజలు ఔషధంలా ఉపయోగపడతాయి. జామకాయ గింజలను, ఉసిరి గింజలను కొబ్బరి నూనెలో వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ పేస్ట్‌ని మొటిమలున్న ప్రదేశాల్లో రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.

* మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఉసిరి గింజలతో ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఉసిరి గింజలతో తయారు చేసిన పొడిని గోరు వెచ్చని నీళ్లలో వేసుకొని తాగితే మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

* ఎక్కిళ్లు అనేవి సహజ సమస్యే అయినప్పటికీ కొందరిలో మాత్రం తీవ్ర ఇబ్బందికి దారి తీస్తుంటాయి. అలాంటి వారు ఉసిరి గింజలతో చేసిన పొడిని తేనెతో కలిపి తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.

నోట్‌: పైన పేర్కొన్న విషయాలు ప్రాథమిక సమాచారం ఆధారంగా మాత్రమే అందించడం జరిగింది. అయితే సదరు సమస్యలకు కేవలం ఈ చిట్కాను మాత్రమే పాటించడం సరైంది కాదు. వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే ఇలాంటివి పాటించడం సూచించదగ్గ అంశం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..