WHO: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న వైరస్.. మంకీపాక్స్ పై డబ్య్లూహెచ్ఓ కీలక ప్రకటన..

వేగంగా వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్(Monkeypox) వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. కరోనా కేసులు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్న...

WHO: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న వైరస్.. మంకీపాక్స్ పై డబ్య్లూహెచ్ఓ కీలక ప్రకటన..
Who News
Follow us

|

Updated on: May 27, 2022 | 9:19 PM

వేగంగా వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్(Monkeypox) వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. కరోనా కేసులు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్న మంకీపాక్స్‌ వైరస్‌ కరోనా అంత ప్రమాదకారి కాదని వెల్లడించింది. ఈ వైరస్‌ ను నివారించేందుకు అవసరమైన టీకాలు ఏయే దేశాల వద్ద ఎన్ని ఉన్నాయో పూర్తి సమాచారం లేదని తెలిపింది. ప్రస్తుతం 20 దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు బయటపడ్డాయి. పశ్చిమ ఆఫ్రికా బయట తొలిసారిగా ఈ వైరస్ ను గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. తొమ్మిది ఆఫ్రికన్ దేశాల్లో(African Countries) మంకీపాక్స్‌ వ్యాప్తిని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వివరించింది. వైరస్ వ్యాప్తిపై దృష్టి సారిస్తే నివారించడం అంత కష్టమేమీ కాదని పేర్కొంది. సరైన చర్యలు తీసుకుంటే మంకీపాక్స్‌ను సులువుగా కట్టడి చేయవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతం వైరస్‌ సోకినవారి క్లోజ్‌ కాంటాక్ట్‌లకు సరిపడే టీకాలు అందుబాటులో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.

కరోనా ప్రబలిన తొలినాళ్లలో వైరస్ నియంత్రణ చికిత్స ఎవరికీ తెలియదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వైరస్ కు బలయ్యారు. కానీ మంకీపాక్స్‌ అలా కాదు. దీనికి చికిత్స ఎప్పటినుంచో అందుబాటులో ఉంది. వైరస్‌ సోకిన వారికి టీకా అందిస్తే రెండు నుంచి నాలుగు వారాల్లోపు కోలుకుంటారు.

  – డబ్ల్యూహెచ్ఓ

ఇవి కూడా చదవండి

ఆఫ్రికా నుంచి యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్ .. ఇంకా భారత్ లో అడుగు పెట్టలేదు. ఇప్పటి వరకూ ఈ వైరస్ కు సంబంధించిన ఎటువంటి అనుమానిత కేసులు నమోదు కాలేదు. అయినప్పటికీ మంకీ పాక్స్ వైరస్ ఉపఖండంలో అడుగు పెట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం.. భారత్ దేశంలో పర్యాటక సీజన్ మొదలైనందున ఈ మంకీ పాక్స్ వైరస్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి