Cardiac Arrest: విమానంలో కార్డియాక్‌ అరెస్ట్‌కి గురైన ప్రయాణికుడు.. సిబ్బంది ఏం చేశారంటే..?

ardiac Arrest: విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు సడెన్‌గా కార్డియాక్‌ అరెస్ట్‌కి గురయ్యాడు. సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు.

Cardiac Arrest: విమానంలో కార్డియాక్‌ అరెస్ట్‌కి గురైన ప్రయాణికుడు.. సిబ్బంది ఏం చేశారంటే..?
Cardiac Arrest
Follow us

|

Updated on: May 28, 2022 | 7:16 AM

Cardiac Arrest: విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు సడెన్‌గా కార్డియాక్‌ అరెస్ట్‌కి గురయ్యాడు. సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. యూనస్ రేయన్‌‌రోత్ కన్నూరు నుంచి దుబాయ్‌ వెళ్తున్న వాడియా గ్రూప్‌కు చెందిన విమానం ఎక్కారు. అయితే ప్రయాణం మధ్యలో ఆయన కార్డియాక్‌ అరెస్ట్‌కి గురయ్యాడు. బాధతో అరవడంతో విమాన సిబ్బంది అప్రమత్తమై ఆయన దగ్గరికి వెళ్లారు.

ఏమైందో చూసేసరికి అప్పటికే శ్వాస ఆగిపోయి, అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై CPR ప్రక్రియను ప్రారంభించారు. అయితే లక్కీగా అదే ఫ్లైట్‌లో డాక్టర్ షబర్ అహ్మద్ ఉండడంతో యూనస్‌ను కాపాడేందుకు ఓ డాక్టర్ దొరికినట్లయింది. ఏఈడీతో రెండు షాకులు ఇచ్చి.. సీపీఆర్‌ పద్ధతిని పాటించారు. దీంతో గుండె కొట్టుకోవడం ప్రారంభమై వ్యక్తికి మెలకువ చ్చింది. వెంటనే విమానంలోని ఆక్సిజన్ వ్యవస్థపై యూనస్‌ను ఉంచారు.

విమానం దుబాయ్‌లో ల్యాండ్ అయిన తర్వాత యూనస్ రేయన్‌రోత్‌ను వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి కిందకు దించి.. తర్వాత ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికుడిని కాపాడడ్డంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన విమాన సిబ్బందికి గో ఫస్ట్‌ విమాన సంస్థ నగదు బహుమతిని ప్రకటించింది. అలాగే గుండెపోకు గురైన యూనస్‌కు, అతడిని కాపాడిన డాక్టర్ సబర్ అహ్మద్‌కు దేశ, విదేశాల్లో ప్రయాణించేందుకు ఉచిత టికెట్‌ను ఆఫర్ చేసింది. ఏదిఏమైనప్పటకీ ఆ ప్రయాణికుడికి ఇంకా భూమ్మీద నూకలున్నాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి