AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Price Today: భగ్గుమంటోన్న క్రూడాయిల్‌.. తాజాగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే..?

కేరళ, రాజస్థాన్ ప్రభుత్వం వ్యాట్‌ని తగ్గించినప్పటికీ, అనేక ఇతర నగరాల కంటే ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. జైపూర్‌లో పెట్రోలు ధర రూ. 109.46 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 94.61గా ఉంది. తిరువనంతపురంలో లీటర్ పెట్రోల్ రూ.107.87, డీజిల్ రూ.96.67గా ఉంది.

Petrol-Diesel Price Today: భగ్గుమంటోన్న క్రూడాయిల్‌.. తాజాగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే..?
Venkata Chari
|

Updated on: May 28, 2022 | 6:50 AM

Share

పెట్రోల్, డీజిల్(Petrol & Diesel) ధరలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఈరోజు అంటే మే 28 శనివారం పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో వరుసగా 7వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం ఈ రోజు (శనివారం, మే 21, 21) కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 22 నుంచి దేశవ్యాప్తంగా చమురు ధరలు లీటరుకు రూ.7 నుంచి రూ.9.5కి తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం తర్వాత, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై విధించే వ్యాట్ (విలువ-ఆధారిత పన్ను) ని తగ్గించాయి. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ ప్రజలకు రెట్టింపు ఉపశమనం లభించింది.

దేశవ్యాప్తంగా 7 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో నేటికీ దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, జిల్లాల్లో పాత ధరకే పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.96.72, డీజిల్ రూ.89.62కు విక్రయిస్తున్నారు. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35, డీజిల్ ధర రూ.97.28గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. అదే సమయంలో కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76కాగా, హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర లీటరుకు రూ.97.82గా ఉంది.

కేరళ, రాజస్థాన్‌లో వ్యాట్‌ తగ్గినా ఉపశమనం లేదు..

కేరళ, రాజస్థాన్ ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించినప్పటికీ, అనేక ఇతర నగరాల కంటే ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. జైపూర్‌లో పెట్రోలు ధర రూ. 109.46 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 94.61గా ఉంది. తిరువనంతపురంలో లీటర్ పెట్రోల్ రూ.107.87, డీజిల్ రూ.96.67గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ తాజా ధరలు..

నగరం పెట్రోల్ ధర లీటరుకు రూ. డీజిల్ ధర లీటరుకు రూ.
ఢిల్లీ 96.72 89.62
ముంబై 111.35 97.28
కోల్‌కతా 106.03 92.76
చెన్నై 102.63 94.24
బెంగళూరు 101.94 87.89
హైదరాబాద్ 109.66 97.82
పాట్నా 107.24 94.04
భోపాల్ 108.65 93.90
జైపూర్ 109.46 94.61
లక్నో 96.57 89.76
తిరువనంతపురం 107.87 96.67

భగ్గుమంటోన్న ముడిచమురు ధరలు..

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. శనివారం, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $ 117 పైన ట్రేడవుతున్నాయి. WTI క్రూడ్ ధర 113 డాలర్లకు చేరుకోగా, బ్రెంట్ క్రూడ్ ధర 117 డాలర్లకు చేరుకుంది.

తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..