Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WHO: పిల్లల్లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ అలవాటు.. 2050 నాటికి ప్రపంచంలో సగం మందికి మైయోపియా..షాకింగ్ విషయాలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్లకు పైగా ప్రజలు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఒక బిలియన్ మందికి నయం చేయవచ్చు. 90 శాతం దృష్టి లోపం ఉన్నవారు తక్కువ.. మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు. భారతదేశంలో కూడా 10 కోట్ల మందికి కంటి అద్దాలు అవసరం ఉన్నా ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో కళ్లజోడుని వేయించుకోలేకపోతున్నారు.  

WHO: పిల్లల్లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ అలవాటు.. 2050 నాటికి ప్రపంచంలో సగం మందికి మైయోపియా..షాకింగ్ విషయాలు
Myopia
Follow us
Surya Kala

|

Updated on: Oct 07, 2023 | 1:16 PM

పంచేంద్రియాల్లో కళ్లు ప్రధానమైనవి అని సైన్స్ అన్నా.. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని పెద్దలు చెప్పినా ఒకటే అర్ధం.. అవును మనిషికి ఉన్న అవయవాల్లో కళ్ళు అతి సున్నితమైనవి.. అంతేకాదు ప్రపంచాన్ని మనకు చూపించేవి కళ్ళే.. అయితే మనిషి మారిన జీవన విధానం, అలవాట్లతో వయసుతో సంబంధం లేకుండా కళ్లు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్  విషయం ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్లకు పైగా ప్రజలు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. అయితే 2050 నాటికి ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని.. ప్రపంచంలో సగం జనాభా మైయోపియాతో బాధపడతారని వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) SPEX 2030 చొరవతో కంటి వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్లకు పైగా ప్రజలు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఒక బిలియన్ మందికి నయం చేయవచ్చు. 90 శాతం దృష్టి లోపం ఉన్నవారు తక్కువ.. మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు. భారతదేశంలో కూడా 10 కోట్ల మందికి కంటి అద్దాలు అవసరం ఉన్నా ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో కళ్లజోడుని వేయించుకోలేకపోతున్నారు.

వాస్తవానికి ప్రతి ఒక్కరికీ సరైన కంటి సంరక్షణ ..  చికిత్స కోసం 24.8 బిలియన్ US డాలర్లు అవసరం. కంటి రోగులకు సహాయం చేయకపోతే ప్రపంచం భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని WHO అంచనా వేసింది. కంటి సమస్యలో మైయోపియా ఒక ప్రధాన సమస్యగా మారుతోంది.. అంచనావేసింది.

ఇవి కూడా చదవండి

మైయోపియా అంటే..

సమీప దృష్టి (మైయోపియా లేక సమీప దృష్టి రుగ్మత) రుగ్మత అంటే.. సమీప వస్తువులను లేదా దగ్గరగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగల స్థితిలో ఉంటారు. అయితే దూరంలో ఉండే వస్తువుల్ని స్పష్టంగా చూడలేరు. అస్పష్టంగా మాత్రం కనబడుతాయి

కంటి లోపం పూర్తిగా అనిపిస్తే తప్ప సామాన్యులు వైద్యుల వద్దకు వెళ్లరు. అప్పుడు ఇలాంటి సమస్య అధికం అవ్వొచ్చు. మైయోపియా వల్ల చేయాల్సిన పనులు కూడా చేసుకోలేని స్టేజ్ కు చేరుకోవచ్చు. 2050 నాటికి  ప్రపంచంలోని సగం మంది మైయోపియాతో బాధపడతారని who స్పష్టం చేసింది. సమీప దృష్టి వ్యాధితో బాధపడుతున్న బాధితులు భారత్ సహా ఇతర ఆసియా దేశాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మరింత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకుని రావాలి ఉంది.

పిల్లలను రక్షించడం ముఖ్యం

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ సమస్యను నివారించడానికి స్క్రీన్ సమయాన్ని తగ్గించడం అంటే పిల్లల్లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్, టీవీ, కంప్యూటర్ ను చూసే అలవాటు తగ్గించి..  బహిరంగ క్రీడల వంటి కార్యకలాపాలలో పిల్లలను చేర్చడం చాలా ముఖ్యం అని సూచిస్తుంది. ఈ చర్యలు కంటి వ్యాధులను ఎదుర్కోవటానికి.. రోగుల సంఖ్యను తగ్గించడానికి సహాయపడతాయని వెల్లడించింది. అన్ని వయసుల వారికి క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించడం అవసరం.. దీని కోసం మారుమూల గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలను సృష్టించడం అవసరం. ప్రభుత్వం అక్కడ వైద్యులను, అవసరమైన వనరులను సమకూర్చాలి. దృష్టి లోపాన్ని తగ్గించడానికి ప్రభుత్వ విద్యా ప్రచారం అవసరమని కూడా భావించారు.. తద్వారా ప్రజలు తమ పిల్లలను కాపాడుకోవచ్చు.

కంటిపై ఒత్తిడిని నివారించేలా

WHO..  SPEX 2030 చొరవతో తన స్థాయిలో సహాయం చేయడానికి ఒక ప్రణాళికతో పని చేస్తోంది. ఇందులో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, ప్రయివేటు రంగాల పాత్రను కూడా విశిదీకరించింది. అత్యంత సాధారణ కంటి వ్యాధులలో అత్యంత ప్రముఖమైనవి వర్ణాంధత్వం, కంటిశుక్లం/గ్లాకోమా, మచ్చల క్షీణత మొదలైనవి. వర్ణాంధత్వం మినహా మిగిలిన అన్ని వ్యాధులకు చికిత్స ప్రస్తుతం సాధ్యమే. అదేవిధంగా సమీపంలో, లేదా దూరదృష్టి సమస్యను అద్దాలతో సరిదిద్దవచ్చు. ఎవరికైనా అస్పష్టమైన దృష్టి, నిరంతర తలనొప్పి లేదా కళ్లలో ఒత్తిడి అని పిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. ప్రారంభ రోజుల్లో వీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. రానున్న పెద్ద సమస్యలను నివారించవచ్చు.

 74వ ప్రపంచ ఆరోగ్య సభలో

2021లో జరిగిన 74వ ప్రపంచ ఆరోగ్య సభలో ప్రపంచ ఆరోగ్య సంస్థ SPEX 2030ను ప్రారంభించాలని నిర్ణయించింది. దీని కింద సభ్య దేశాలకు ముందుగా కళ్లద్దాల ద్వారా సహాయం అందించనున్నారు. కొన్ని మౌలిక సదుపాయాల కల్పనలో సహాయం చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. కంటి లోపాన్ని వీలైనంత త్వరగా సరిదిద్దాలనే ఆలోచన ఉంది. తద్వారా పరిస్థితి మరింత తీవ్రమవకుండా నివారింపబడవచ్చు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ..  సేవలు, ప్రజలకు సహాయం చేయడం, విద్యపై అవగాహన, కళ్లద్దాల ధరను తగ్గించడం, బాధిత వ్యక్తులను సకాలంలో గుర్తించడం.. కంటి సమస్యలను నిర్ధారించడం.. నివారణ చర్యలపై దృష్టి పెట్టడం లక్ష్యంగా  ప్రపంచ ఆరోగ్య సంస్థ.. పనిచేస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..