AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Immunity: ఈ పండ్లు తింటే రోగనిరోధక శక్తి పెరగుతుంది.. అంతేకాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ముఖ్యంగా పిల్లలకు..

శీతాకాలంలో కొన్ని రకాల పండ్లు తింటే జలుబు చేస్తుందంటుంటారు. పండ్లు ఆరోగ్యానికి ఆరోగ్యకరం కూడా. పండ్లలో కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉంటే మరికొన్ని ఎప్పుడూ దొరుకుతూ ఉంటాయి. చలికాలంలో కొన్ని రకాల పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పండ్లతో..

Child Immunity: ఈ పండ్లు తింటే రోగనిరోధక శక్తి పెరగుతుంది.. అంతేకాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ముఖ్యంగా పిల్లలకు..
Healthy Food For Kids
Amarnadh Daneti
|

Updated on: Nov 07, 2022 | 11:04 AM

Share

శీతాకాలంలో కొన్ని రకాల పండ్లు తింటే జలుబు చేస్తుందంటుంటారు. పండ్లు ఆరోగ్యానికి ఆరోగ్యకరం కూడా. పండ్లలో కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉంటే మరికొన్ని ఎప్పుడూ దొరుకుతూ ఉంటాయి. చలికాలంలో కొన్ని రకాల పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పండ్లతో వ్యక్తికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పండ్లను పిల్లలకు తినిపిస్తే మంచి పోషణతో పాటు సీజనల్ వ్యాధుల ప్రమాదం నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. ఏ సీజన్ లో లభించే పండ్లను ఆ సీజన్‌‌‌లోనే తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. సాధారణంగా చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. చిన్నపిల్లలూ తరచూ దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతుంటారు. వారికి ఈ సమయంలో బలవర్థకమైన పోషకాహారం ఎంతో అవసరం. ఈ చలికాలంలో లభించే కొన్ని పండ్ల రకాలను తినడం వలన వారికి మంచి పోషణ అందడంతో పాటు వ్యాధుల బారినపడే ప్రమాదం తగ్గుతుంది. జ్యూస్‌లకు బదులు నేరుగా ఫ్రూట్స్‌ను తినడం ఉత్తమం. వివిధ రకాల పండ్లను ముక్కలుగా కోసి అల్పాహారంగా తీసుకోవచ్చు. పిల్లలకు ఎటువంటి పండ్లు తినిపిస్తే మంచిదో తెలుసుకుందాం.

ఉసిరి

ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వెంట్రుకలు పెరుగుదల, చర్మం, కళ్ల ఆరోగ్యానికి ఉసిరికాయలు మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. తినే ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

నారింజ

నారింజలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో విటమిన్ సి తోపాటు పొటాషియం, ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటాయి. పిల్లలు నారింజలను తినడానికి ఎంతో ఇష్టపడతారు.

ఇవి కూడా చదవండి

నల్ల ద్రాక్ష

నల్ల ద్రాక్ష చలికాలంలో దొరుకుతుంది. వీటితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ద్రాక్షలోని పోషకాలు పిల్లల గుండె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది.

దానిమ్మ

చలికాలంలో పిల్లలకు అందించాల్సిన పండ్లలో దానిమ్మ ఒకటి. వీటిలో విటమిన్ సి, ఇ , కె, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం ఐరన్ వంటివి ఉన్నాయి. ఈ పోషకాలన్నీ పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. వైరస్‌ ఫ్లూల బారినుండి పోరాడటానికి సహాయపడతాయి.

క్యారెట్

పండ్లతో పాటు క్యారెట్ పిల్లలకు తినిపిస్తే మంచిది. క్యారెట్‌లో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే పిల్లల కంటి చూపు సరిగ్గా ఉంటుంది, కాబట్టి వారికి క్యారెట్‌లను ఏదో ఒక రూపంలో తినిచాలని నిపుణులు సూచిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)