AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jogging in winter: చలికాలంలో జాగింగ్ చేయడం మంచిదేనా.. ఎలాంటి ఇబ్బందులుంటాయి..

ఆరోగ్యం కోసం చాలా మంది ప్రతిరోజూ వాకింగ్ చేయడాన్ని అలవాటుగా చేసుకుంటారు. అయితే ప్రస్తుతం శీతాకాలంలో ఉదయం వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కొంతమందికి చలి తగిలితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే చలికాలంలో వాకింగ్, జాకింగ్ వంటివి..

Jogging in winter: చలికాలంలో జాగింగ్ చేయడం మంచిదేనా.. ఎలాంటి ఇబ్బందులుంటాయి..
Jogging
Amarnadh Daneti
|

Updated on: Nov 07, 2022 | 11:24 AM

Share

ఆరోగ్యం కోసం చాలా మంది ప్రతిరోజూ వాకింగ్ చేయడాన్ని అలవాటుగా చేసుకుంటారు. అయితే ప్రస్తుతం శీతాకాలంలో ఉదయం వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కొంతమందికి చలి తగిలితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే చలికాలంలో వాకింగ్, జాకింగ్ వంటివి చేయ్యొచ్చా లేదా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. పలానా కాలంలో మాత్రమే వాకింగ్, జాకింగ్ చేయాలి.. మిగిలిన సమయాల్లో చేయకూడదనే నిబంధన ఏమి లేదు.. అయితే శీతాకాలంలో చలి ఎక్కువుగా ఉంటుంది కాబట్టి వ్యాయామం చేసేటప్పుడు కొన్ని పద్ధతులను మార్చుకోవాల్సి ఉంటుంది. సీజన్ మారింది కాబట్టి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యాయామం చేసే విధానంలోనూ మార్పు చేసుకోవడం మంచిది. ఏ వ్యాయామం ప్రారంభించే ముందైనా వార్మప్ తప్పనిసరి. అయితే చలికాలంలో వ్యాయామానికి ముందు చేసే వార్మప్ సమయం ఎక్కువ ఉండాలి. పది నిమిషాలకు బదులుగా పదిహేను నిమిషాలు వార్మప్‌లో గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే చలికి కండరాలు గట్టిపడిపోతాయి, మీరు శరీరంలోపలి నుంచి సరైన వేడిని ఇవ్వకుండా వ్యాయామం చేస్తే కండరాల ఒత్తిడికి గురవుతాయి, కండరాల తిమ్మిరి, నొప్పులు వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. చలికాలంలో వ్యాయామం అనంతరం శరీరం చల్లబరచటానికి శరీరానికి చాలా తక్కువ సమయం పడుతుంది. కూల్ డౌన్ ప్రక్రియ తక్కువ ఉండేలా చూసుకోవాలి. స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం మంచిది. చాలామందికి ఉదయాన్నే లేచి పార్కులలో లేదా ఆరుబయట కొద్ది దూరం వరకు జాగింగ్ చేసే అలవాటు ఉంటుంది. అలాంటివారు తెలుసుకోవల్సిన విషయాలు.

శరీరాన్ని ధృడంగా ఉంచుకోవడం కోసం చలికాలంలో జాగింగ్ చేయవచ్చు. అయితే ఈ కాలంలో వాకింగ్, జాగింగ్ చేస్తే కొన్ని ప్రయోజనాలు, అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. చలికాలంలో జాగింగ్ చేయడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తేలికపాటి లేదా మితమైన పరుగుతో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సహేతుకమైన వేగంతో పరిగెత్తడం, నడవడం ద్వారా అది శరీరంలోని సహజ రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.

చలికాలంలో జాగింగ్ చేస్తున్నపుడు శ్వాసక్రియపై శ్రద్ధ తీసుకోవాలి. సరైన శ్వాస తీసుకోవడం చాలా అవసరం. నోటి ద్వారా పొడి, చల్లని గాలిని పీల్చకూడదు. చల్లటి శ్వాసతో శ్వాసకోశ, శ్లేష్మ పొరలు చల్లగా మారుతాయి. తద్వారా ఊపిరితిత్తులలో మంటతో పాటు, దగ్గును కలిగిస్తుంది. మీరు ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతుంటే, మరిన్ని ఇబ్బందులను కలిగిస్తుంది. దీనికి పరిష్కారంగా మాస్కును లేదా ఏదైనా క్లాత్ ను మూతికి ధరించడం బెటర్. ఇలా చేయడం ద్వారా పీల్చే గాలిని వెచ్చగా, తేమగా మార్చడానికి సహాయపడుతుంది. చలికాలం వ్యాయామం చేసేవారు ధరించే దుస్తుల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డబుల్ లేయర్ కలిగి శరీరాన్ని వెచ్చగా ఉంచేవి ఎంచుకోవాలి. పొగమంచు కారణంగా చీకటిగా ఉంటుంది కాబట్టి, ప్రమాదాలు నివారించేదుకు దుస్తులు రేడియం రిఫ్లెక్టర్స్ కలిగి ఉంటే మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..