Vitamin D: విటమిన్ డీ లోపం ఉంటే చలికాలంలో ఈ సమస్యలు ప్రమాదం.. వాటి లక్షణాలను తెలుసుకోండి..

ఆరోగ్యంగా ఉండాలంటే.. విటమిన్స్, ఖనిజాలు.. పోషకాలు పుష్కలంగా ఉండాలి. మన శరీరానికి విటమిన్స్

Vitamin D: విటమిన్ డీ లోపం ఉంటే చలికాలంలో ఈ సమస్యలు ప్రమాదం.. వాటి లక్షణాలను తెలుసుకోండి..
Vitamin D
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 17, 2021 | 5:44 PM

ఆరోగ్యంగా ఉండాలంటే.. విటమిన్స్, ఖనిజాలు.. పోషకాలు పుష్కలంగా ఉండాలి. మన శరీరానికి విటమిన్స్ చాలా ముఖ్యం. విటమిన్ డి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా కూడా వస్తుంది. తీసుకునే ఆహారపదార్థాలతో మాత్రమే కాకుండా.. శరీరంలో విటమిన్ డి లోపాన్ని తగ్గించుకునేందుకు సూర్యరశ్మిలో రోజూ కాసేపు నిల్చోవాలి అంటారు. శరీరంలో విటమిన్స్, ఖనిజాలు తగ్గినప్పుడు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక విటమిన్ డీ ఎముకలు బలంగా చేయడం. ఒత్తిడిని తగ్గించడం.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

సూర్యరశ్మిలో కాసేపు నిల్చుంటే విటమిన్ డీ శాతం పెరుగుతుందని అందరికి తెలిసిన విషయమే. అలాగే సప్లిమెంట్స్.. రిచ్ ఫుడ్స్ ద్వారా కూడా దీనిని పెంచుకోవచ్చు. శరీరంలో కాల్షియం, ఫాస్పరస్ శోషణను నియంత్రించడంలో విటమిన్ డీ సహయపడుతుంది. దీంతోపాటు అనేక వ్యాధులతో పోరాడుతుంది. ఎముకలు, దంతాల సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గించి మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా..విటమిన్ డీ బరువును కూడా తగ్గిస్తుందని ఇటీవల పలు అధ్యాయనాల్లో వెల్లడైంది.

ఇక విటమిన్ డీ లోపం ఉన్నట్లయితే చలికాలంలో పలు సమస్యలు మరింత పెరిగుతాయి. విటమిన్ డీ లోపం ఉన్నవారు వింటర్ లో ఎక్కువగా అలసటగా.. బలహీనంగా ఉంటారు. రోజు వారీ పనితీరులోనూ బలహీన పడిపోతుంటారు. కండరాలు బలహీనంగా మారిపోవడం.. మెట్లు ఎక్కడం.. దిగడం.. నేలపై నుంచి లేవడం లేదా.. కుర్చీలోనే కూర్చుండిపోవడం లక్షణాలు ఉంటాయి. అలాగే విటమిన్ డీ లోపం వలన రికెట్స్ సమస్య ఏర్పడుతుంది. ఇది పిల్లల ఎముకలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. విటమిన్ డీ కాల్షియం, భాస్వరం శోషణలో సహాయపడుతుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. శరీరంలో విటమిన్ డీ తక్కువగా ఉందా ? లేదా ? అనేది రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.

Also Read: Vishwanathan Anand: వెండితెరపైకి విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్.. తన పాత్రలో ఆ హీరో నటించాలంటూ..

Koratala Shiva: పట్టాలెక్కనున్న ఎన్టీఆర్ న్యూమూవీ.. షూటింగ్ స్టార్ట్ చేయనున్న కొరటాల శివ..

Anubhavinchu Raja: బంగార్రాజు చేతుల మీదుగా అనుభవించు రాజా ట్రైలర్.. ఆకట్టుకుంటున్న డైలాగ్స్..