Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwanathan Anand: వెండితెరపైకి విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్.. తన పాత్రలో ఆ హీరో నటించాలంటూ..

గత కొద్ది కాలంగా వెండితెరపై ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Vishwanathan Anand: వెండితెరపైకి విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్.. తన పాత్రలో ఆ హీరో నటించాలంటూ..
Viswanathan Anand
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 17, 2021 | 4:59 PM

గత కొద్ది కాలంగా వెండితెరపై ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురి బయోపిక్స్‏తో వచ్చిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో సినీ కళాకారులు… దిగ్గజ ఆటగాళ్లు..వ్యాపారవేత్తల జీవిత కథలు వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు దర్శకులు. ఇప్పటివరకు వచ్చిన బయోపిక్స్ అన్ని బాక్సాఫీసు వద్ద రికార్డ్స్ సృష్టించాయి. అయితే ఐదుసార్ల వరల్డ్ చెస్ ఛాంపియన్‏గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని రూపొందించేందుకు ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా తన బయోపిక్ గురించి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు విశ్వనాథ్ ఆనంద్.

కోల్‏కత్తాలో బుధవారం (నవంబర్ 17) నుంచి వచ్చే ఆదివారం వరకు అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ జరగనుంది. రెండేళ్ల క్రితం జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సెన్‏తో పోటీ పడ్డాడు. అయితే ఈసారి ఆనంద్‏ను కంటెస్టెంట్‏గా పోటీకి మెంటర్‏గా నియమించనున్నారు మేకర్స్. ఆనంద్ తన వ్యక్తిగత విషయాలను ఏమాత్రం బయటకు రాకుండా చాలా గోప్యంగా ఉంచుతారని అంటుంటారు… కానీ ఈ సినిమా ద్వారా ఇప్పుడు తన జీవితం గురించి తెలుస్తోందని.. చెస్ ప్లేయర్లు గ్రహాంతర గ్రహం నుంచి వచ్చినవారు అనే భావనను ఈ సినిమా ద్వారా తొలగించాలని ఆనంద్ అన్నారు.

విశ్వనాథన్ ఆనంద్ మాట్లాడుతూ.. “నేను నా బయోపిక్ తెరకెక్కించడానికి అంగీకరించాను.. ఈ విషయమై ఇప్పటికే నిర్మాతతో పలుమార్లు చర్చించాము.. నా జీవిత విశేషాలను వారికి చెప్పాను. త్వరలోనే స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. కరోనా కారణంగా పనులు నిలిచిపోయాయి. ఇక ప్రతి పని త్వరలో ప్రారంభమవుతుంది. బయోపిక్ గురించి ఇప్పుడేం చెప్పలేను.. షూటింగ్ ఎప్పుడు ఎలా మొదలవుతుందో తెలియదు. ఈ బయోపిక్ గురించి తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి” అన్నారు ఆనంద్.

ఇక తన బయోపిక్ సినిమాకు ఎవరు దర్శకుడు అని ప్రశ్నించగా.. ఇప్పుడు తాను ఏం చెప్పలేనని.. ప్రస్తుతం పనులు మాత్రమే జరుగుతున్నాయని చెప్పగలను..అన్నారు. అలాగే.. ఈ సినిమాలో తన పాత్రలో ఏ హీరోను చూడాలనుకుంటున్నారని ప్రశ్నించగా.. ఆనంద్ ఆసక్తికర సమాధానమిచ్చారు. ఆనంద్ మాట్లాడుతూ.. సినిమానలో నా పాత్రను ఎవరు పోషిస్తారో నేను చెప్పలేను. కానీ నేను ఒకరిని అనుకుంటున్నాను.. విశ్వనాథన్ ఆనంద్‏గా అమీర్ ఖాన్ నటిస్తే బాగుంటుందని.. ఆయనకు నాకు పోలికలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక రాజకీయాల్లోకి వస్తున్నారా ? అని ప్రశ్నించగా.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఎప్పటికీ చెస్ ఆడుతూ ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇక ఇప్పట్లో పదవి విరమణ చేసే ఆలోచన లేదని.. కరోనా సమయంలోనూ ఆన్ లైన్ టోర్నమెంట్స్ ఆడానని.. నవంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ చాంపియన్ షిప్ లకు వ్యాఖ్యతగా ఉండబోతున్నట్లుగా చెప్పారు ఆనంద్.

Also Read: Agent: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. మేజర్ షెడ్యూల్ పూర్తి చేసిన ఏజెంట్..

Kangana Ranaut: మోడీ కూడా మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకున్నారు.. కంగనా వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ మహిళా నేత..