Agent: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. మేజర్ షెడ్యూల్ పూర్తి చేసిన ఏజెంట్..

అఖిల్ అక్కినేని.. ఇప్పుడు ఫుల్ జోష్‏లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత.. ఇటీవల అఖిల్ అక్కినేని.. పూజా

Agent: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. మేజర్ షెడ్యూల్ పూర్తి చేసిన ఏజెంట్..
Agent
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 17, 2021 | 4:29 PM

అఖిల్ అక్కినేని.. ఇప్పుడు ఫుల్ జోష్‏లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత.. ఇటీవల అఖిల్ అక్కినేని.. పూజా హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరోకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ సక్సెస్ అందించింది. ఇక ఈ సినిమాతో అఖిల్ తన తదుపరి చిత్రాలపై మరింత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అఖిల్ లుక్ తెగ ఆకట్టుకుంది.

స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీలోని పలు కీలకమైన సన్నివేశాలను విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టులలో చిత్రీకరిస్తున్నారు. అలాగే గత కొద్ది రోజులుగా ఈ సినిమా యూరప్ లోని బడా ఫెస్ట్ లో మేజర్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ మేజర్ షెడ్యూల్ షూటింగ్‏ను పూర్తిచేసింది చిత్రయూనిట్. ఇక తదుపరి షెడ్యూల్ ను హైద్రాబాద్ లో ప్లాన్ చేశారట. దీంతో ఇక్కడే చాలావరకు షూటింగ్ పూర్తి అవుతుందని అంటున్నారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా.. అతుల్య రవి సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే ఇందులో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.

Also Read: Spider Man No Way Home: నలుగురు విలన్లతో.. ‘స్పైడర్ మాన్’ భీకర యుద్ధం.. కథలో అద్భుత ట్విస్ట్.!

Kangana Ranaut: మోడీ కూడా మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకున్నారు.. కంగనా వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ మహిళా నేత..

Koratala Shiva: పట్టాలెక్కనున్న ఎన్టీఆర్ న్యూమూవీ.. షూటింగ్ స్టార్ట్ చేయనున్న కొరటాల శివ..

Anubhavinchu Raja: బంగార్రాజు చేతుల మీదుగా అనుభవించు రాజా ట్రైలర్.. ఆకట్టుకుంటున్న డైలాగ్స్..