Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: మోడీ కూడా మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకున్నారు.. కంగనా వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ మహిళా నేత..

భారతదేశ స్వాతంత్ర్యం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు మూట గట్టుకుంది బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా ఇటీవల తనకు బహూకరించిన 'పద్మశ్రీ' పురస్కారాన్ని వెనక్కు తీసుకోవాలన్న

Kangana Ranaut: మోడీ కూడా మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకున్నారు.. కంగనా వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ మహిళా నేత..
Follow us
Basha Shek

|

Updated on: Nov 17, 2021 | 4:17 PM

భారతదేశ స్వాతంత్ర్యం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు మూట గట్టుకుంది బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా ఇటీవల తనకు బహూకరించిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కు తీసుకోవాలన్న డిమాండ్లు సైతం వినిపించాయి. అయినా బాలీవుడ్‌ ‘క్వీన్‌’ వెనక్కు తగ్గడం లేదు. తాజాగా జాతిపిత మహాత్మాగాంధీని విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో వరసగా పోస్ట్‌లు పెట్టింది. ‘ఒక చెంప చూపితే స్వాతంత్య్రం రాదని, భిక్ష మాత్రమే వస్తుందని.. స్వాతంత్ర్య వీరులు సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌కు గాంధీ మద్దతు ఇవ్వలేదని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ల్లో రాసుకొచ్చింది. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి, ప్రముఖ సామాజిక కార్యకర్త నిఘత్‌ అబ్బాస్‌ కంగనా వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా గాంధీజీని స్ఫూర్తిగా తీసుకున్నారని కంగనాకు హితబోధ చేశారు. మహాత్ముడిని విమర్శించడం ద్వారా అంతర్జాతీయంగా భారతదేశ పరువును కంగనా మంటగలుపుతోందని నిఘత్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేసింది. ‘ భారతదేశ స్వాతంత్రోద్యమంలో గాంధీజీ పోరాటానికి గుర్తుగా అందరూ ఆయనకు ‘జాతిపిత’ అని పిలుచుకుంటున్నారు. గాంధీజీ నుంచి ప్రేరణ పొందానిని ప్రధాని నరేంద్రమోడీ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అలాంటి మహాత్ముడిని కంగనా విమర్శించింది. ఆమె తన అసంబద్ధ వ్యాఖ్యలతో ఏం సాధించాలనుకుంటుందో అర్థం కావడం లేదు. భారత స్వాతంత్ర్యోద్యమం, అందులో పాల్గొన్న వారిని తరచూ విమర్శించడం ద్వారా కంగనా దేశ ప్రజలను బాధిస్తోంది. అంతేకాదు అంతర్జాతీయంగా మన దేశ పరువు, ప్రతిష్ఠలను కాలరాజేస్తోంది ‘ అని అబ్బాస్‌ చెప్పుకొచ్చారు.

Also Read:

Kangana Ranaut: మరోసారి రెచ్చిపోయిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. ఈసారి ఏకంగా ఆయన మీదే వివాదాస్పదంగా..

Bigg Boss 5 Telugu: స్నేహితుల మధ్య గొడవ రాజేసిన కెప్టెన్సీ టాస్క్‌.. కాజల్‌, మానస్‌లపై మండిపడ్డ సన్నీ..

Koratala Shiva: పట్టాలెక్కనున్న ఎన్టీఆర్ న్యూమూవీ.. షూటింగ్ స్టార్ట్ చేయనున్న కొరటాల శివ..