AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spider Man No Way Home: నలుగురు విలన్లతో.. ‘స్పైడర్ మాన్’ భీకర యుద్ధం.. కథలో అద్భుత ట్విస్ట్.!

'స్పైడర్ మాన్' సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటిదాకా వచ్చిన స్పైడర్ మాన్ సిరీస్‌లన్నీ కూడా బాక్స్ ఆఫీస్...

Spider Man No Way Home: నలుగురు విలన్లతో.. 'స్పైడర్ మాన్' భీకర యుద్ధం.. కథలో అద్భుత ట్విస్ట్.!
Spider Man
Ravi Kiran
|

Updated on: Nov 17, 2021 | 4:42 PM

Share

‘స్పైడర్ మాన్’ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటిదాకా వచ్చిన స్పైడర్ మాన్ సిరీస్‌లన్నీ కూడా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టాయి. ఇక ఇదంతా ఒక ఎత్తయితే.. తాజాగా మార్వెల్ స్టూడియోస్ నుంచి మరో స్పైడర్ మాన్ సినిమా రాబోతోంది. అదే ‘స్పైడర్ మాన్ – నో వే హోమ్’. జాన్ వాట్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో టామ్ హాలండ్ ‘స్పైడీ’ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ ‘స్పైడర్ మాన్’ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా సెకండ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రతీ సీన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో.. ప్రేక్షకులను ‘ఎడ్జ్ ఆఫ్ ది సీట్’ ఉంచేలా అద్భుతంగా ఉందని చెప్పాలి. అంతేకాకుండా ఈ సినిమాలో ఓల్డ్ విలన్స్ అందరూ కనిపిస్తుండగా.. ప్రేక్షకులకు నిజంగా ఇది పెద్ద ఫీస్ట్ అని చెప్పొచ్చు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. మిస్టీరియో అనే విలన్ కారణంగా స్పైడర్ మాన్‌ను అందరూ శత్రువులా చూస్తారు. అలాగే పీటర్ పార్కరే స్పైడర్ మాన్ అని తెలియడంతో మరిన్ని సమస్యలు చుట్టుముడతాయి. దీనితో ప్రజలందరూ పీటర్ పార్కరే.. స్పైడర్ మాన్ అని మర్చిపోయేలా చేయాలని డాక్టర్ స్ట్రేంజ్‌ను పీటర్ ఆశ్రయిస్తాడు.

అయితే అనూహ్యంగా సీన్ అంతా తారుమారు అవుతుంది. వివిధ విశ్వాల నుంచి విలన్లు అంతా కూడా ఒక్కసారిగా భూమిపై దాడికి దిగుతారు. దీనితో స్పైడర్ మాన్ సమస్యల వలయంలో చిక్కుకుంటాడు. మరి ఆ దాడిని పీటర్ ఎలా ఎదుర్కున్నాడు. అంతిమ పోరాటంలో విజయం ఎవరిది అనేది తెలియాలంటే తెలియాలంటే వచ్చే నెల 17వ తేదీన ‘స్పైడర్ మాన్: నో వే హోం’ చూడాల్సిందే.!

ఇదిలా ఉంటే.. స్పోయిలర్ అలెర్ట్‌గా ఈ సినిమాలో ముగ్గురు ‘స్పైడీ’లు కలిసి విలన్ల భరతం పడతారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన పలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే తాజాగా వచ్చిన ట్రైలర్‌లో మిగిలిన స్పైడర్ మాన్‌లను ఎడిట్ చేయడం.. ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి లుక్కేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?