Pregnancy Tips: పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలా.. గర్భిణీలూ మీ డైట్‌లో అవకాడో యాడ్ చేసుకోండి..
కాబోయే తల్లులు తీసుకునే ఆహారం కడుపులో ఉన్న బిడ్డపై కచ్చితంగా ఉంటుందనే విషయం తెలిసిందే. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తల్లితో పాటు కడుపులోని బిడ్డకు మేలు చేసే వాటిలో..
కాబోయే తల్లులు తీసుకునే ఆహారం కడుపులో ఉన్న బిడ్డపై కచ్చితంగా ఉంటుందనే విషయం తెలిసిందే. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తల్లితో పాటు కడుపులోని బిడ్డకు మేలు చేసే వాటిలో అవకాడో ఒకటి. ఇందులో ఫైబర్ , విటమిన్-ఎ, సి, ఇ, కె, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఫోలిక్ యాసిడ్ ఎమంతో మేలు చేస్తుంది. ఇందులోని ఫైబర్ గర్భిణీలకు మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది. మధుమేహం దరి చేరకూండా చూస్తుంది. అవకాడా తీసుకోవడం వల్ల గర్భిణీలకు కలిగే ప్రయోజనాలపై ఓ లుక్కేయండి..
* గర్భిణీలు మధుమేహం బారిన పడోదంటే అవకాడో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటికి గర్భిణీలు క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుబుతున్నారు.
* కొన్నిసార్లు తల్లిలో పోషకాహార లోపం కారణంగా శిశువు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. ఆవకాయ తినడం వల్ల పోషకాల లోపాలను భర్తీ చేయవచ్చని అంటున్నారు. ఇందులో పొటాషియం, కాల్షియం, విటమిన్ సితో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పోషకాల లోపాలను భర్తీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
* గర్భధారణ సమయంలో, స్త్రీ శరీరం ఎముకలు బలహీనపడటంతో సహా అనేక మార్పులకు లోనవుతుంది. నొప్పి కారణంగా, గర్భిణీ స్త్రీలు తరచుగా అలసిపోతుంటారు. ఎముకల బలహీనత, నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి అవకాడో తీసుకోవాలి. ఎముకలకు అవసరమయ్యే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
నోట్: పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే అందించడం జరిగింది. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచన తీసుకోవడమే ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..