Weight Loss: బరువు తగ్గాలంటే లంచ్‌లో ఈ మూడింటిని తప్పనిసిరిగా తీసుకోండి.. కొవ్వు వెన్నలా కరిగిపోతుంది తెలుసా..

బరువు పెరగడంతో పాటు, శరీరంలోని అనేక భాగాలలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా శరీరం మొత్తం ఆకృతి మారిపోతుంది. దీనిని నివారించడానికి భోజనంలో కొన్నింటిని చేర్చుకోండి..

Weight Loss: బరువు తగ్గాలంటే లంచ్‌లో ఈ మూడింటిని తప్పనిసిరిగా తీసుకోండి.. కొవ్వు వెన్నలా కరిగిపోతుంది తెలుసా..
Belly Fat Burning
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 27, 2022 | 8:00 PM

 ప్రస్తుతం అన్ని వయసులవారికి బరువు పెరగడం ప్రధాన సమస్యగా మారింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ఇది మరింత భయంకరంగా మారింది. కోవిడ్-19 తర్వాత చాలాసార్లు లాక్‌డౌన్‌ను ఎదుర్కొన్నారు. దీని కారణంగా ఇంటి నుండి పని చేసే సంస్కృతి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో శారీరక శ్రమ తగ్గిపోయి.. నడుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ షేప్‌కి రావడం కష్టమైన పనిగా మారింది. అయితే దీని కోసం మధ్యాహ్నం ఈ 3 ఆహారాలు తినడం వల్ల మీ బరువు తగ్గుతుంది. బరువు తగ్గడానికి వ్యాయామం అవసరం. ఎందుకంటే కొవ్వును కరిగించవచ్చు, కానీ అదే సమయంలో మీరు ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో ఏం తినాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఈ సంగతి తెలిస్తే మీరు మీ బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. 

కూరగాయలు..

మన ఆరోగ్యానికి కూరగాయలు ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. అలాంటి అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇవి శరీరానికి పూర్తి పోషణను అందిస్తాయి. అలాగే శరీర పనితీరు సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఆకు కూరలు తింటే విటమిన్లు, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు శరీరానికి అందుతాయి. కనీస, ఆరోగ్యకరమైన నూనెలో కూరగాయలను సిద్ధం చేయడానికి ప్రయత్నించండి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పప్పులు..

మనలో చాలా మందికి పప్పులు లేకుండా భోజనం పూర్తి కాదు. అవి రుచిగా ఉండటమే కాదు, బరువు తగ్గడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సాధారణంగా, ప్రోటీన్ అవసరం పప్పుల సహాయంతో తీర్చబడుతుంది. కానీ దానితో పాటు శరీరానికి ఐరన్, జింక్ కూడా లభిస్తుంది. బరువు పెరగడమే కాకుండా అనేక ఇతర సమస్యలు దూరమవుతాయి.

పెరుగు..

మధ్యాహ్నం ఎప్పుడు భోజనం చేసిన తర్వాత పెరుగు తప్పనిసరిగా తీసుకోండి. కావాలంటే మజ్జిగ కూడా తాగండి. ఇది కడుపులో వేడిని నియంత్రించడమే కాకుండా జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనం మీ పెరుగుతున్న బరువుకు రివర్స్‌లో పని చేస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!